Republic Day 2022: దేశంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరు దేశభక్తి చిత్రాలను వీక్షిస్తూ, కవాతును చూస్తు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటే మంచిది. అయితే ప్రత్యేక వంటకాలు లేకుండా భారతదేశంలో ఏ వేడుక పూర్తి కాదు. జనవరి 26 సందర్భంగా వివిధ రకాల వంటకాలను ఇంట్లోనే తయారుచేయండి. వాటి గురించి తెలుసుకుందాం.
1. పావ్ భాజీ
పావ్ భాజీ ఒక ప్రసిద్ధ మహారాష్ట్ర వంటకం. కాలీఫ్లవర్, బఠానీలు, బంగాళదుంపలు మొదలైన అనేక రకాల కూరగాయల నుంచి ఈ స్పైసీ భాజీని తయారు చేస్తారు. ఇది అన్ని వయసుల వారు ఇష్టపడే వంటకం. వివిధ ఇళ్లలో వివిధ రూపాల్లో వండుతారు. పావ్‌ను వెన్నతో పూసిన భాజీతో వడ్డిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది.
2. సాంబార్, దోస
సాంబార్, దోస ఒక ప్రసిద్ధ దక్షిణ భారతీయ వంటకం. మీరు అల్పాహారం, రాత్రి భోజనం కోసం సాంబార్ దోసను తీసుకోవచ్చు. ఇది తేలికగా జీర్ణమయ్యే వంటకం. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. చాలా రుచికరమైనది.
3. క్యాబేజీ పకోడీలు
మీకు పకోడీలంటే ఇష్టముంటే ఇంట్లోనే క్యాబేజీ పకోడీలను తయారు చేసుకోవచ్చు. వింటర్ సీజన్‌లో ఒక కప్పు వేడి టీతో ఈ పకోడి తింటే ఆ మజాయే వేరు. దీన్ని చేయడానికి మీకు శెనగపిండి, క్యాబేజీ వెల్లుల్లి పేస్ట్, ఎర్ర మిరప పొడి, ఉప్పు మొదలైనవి అవసరం.
4. బంగాళాదుంప కట్లెట్స్
బంగాళదుంపల నుంచి కొన్ని ప్రత్యేక వంటకాలు తయారు చేయవచ్చు. మీరు బంగాళాదుంప కట్లెట్లను తయారు చేయవచ్చు. ఇది బంగాళాదుంప, ఎర్ర మిరప పొడి, కొత్తిమీర ఆకులు, చాట్ మసాలా, ఉప్పు మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. కుటుంబంతో కలిసి ఈ రుచికరమైన ఆలూ కట్లెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ వంటకం పెద్దలు, పిల్లలు తెగ ఇష్టపడతారు.