Lychee fruit: లిచీ పండు మాత్రమే కాదు.. గింజలు ఆరోగ్యానికి దివ్యఫలం.. డోంట్‌ మిస్‌!

|

Jun 12, 2024 | 3:13 PM

కొన్ని అధ్యయనాలు లీచీ సీడ్ సారం మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుందని తేలింది. దీని సారానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడమే కాకుండా, మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే, లిచీ విత్తనాలను నేరుగా తినకూడదు. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే లిచ్చి విత్తనాలను వాడండి.

Lychee fruit: లిచీ పండు మాత్రమే కాదు.. గింజలు ఆరోగ్యానికి దివ్యఫలం.. డోంట్‌ మిస్‌!
Lychee Fruit Seed
Follow us on

వేసవిలో అందరూ ఇష్టపడే పండ్లలో లిచీ ఒకటి. లిచీ పండు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది లీచీని తిని దాని గింజలను విసిరిపారేస్తుంటారు. కానీ, లిచీ గింజలను పనికి రానివిగా అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే.. లిచ్చి మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి దివ్యౌషధం అని మీకు తెలుసా..? లిచీ విత్తనాలు కూడా ప్రయోజనకరమైనవి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. లిచీ సీడ్ సారం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. లిచీ విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

లిచీ పండు విత్తనాల్లోని గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు లీచీ సీడ్ సారం మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుందని తేలింది. దీని సారానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడమే కాకుండా మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను కూడా తగ్గిస్తుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో లిచి గింజలు సహాయపడతాయి. లిచీ విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో లిట్చీ సీడ్ సారం ప్రయోజనకరంగా ఉంటుంది. లిచ్చి విత్తనాలు కిడ్నీ రోగులకు కూడా మేలు చేస్తాయి. అయితే, లిచీ విత్తనాలను నేరుగా తినకూడదు. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు లిచ్చి విత్తనాలను వాడండి.

ఇవి కూడా చదవండి

లీచీ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్స్ బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పదార్ధాలలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ప్రోయాంతోసైనిడిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

లిచ్చి ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. చర్మానికి మరింత మేలు చేస్తుంది. లిచీ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్‌లో సమృద్ధిగా ఉండే పాలీఫెనాల్స్ చర్మ స్థితిస్థాపకత, ఆర్ద్రీకరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మీరు ఇంట్లోనే లిచి సీడ్ రసం తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా కావాల్సినన్ని లిచీ విత్తనాలను తీసుకోండి. వాటిని బాగా శుభ్రం చేసి ఆరబెట్టి పొడిగా ఉంచండి. ఈ గింజలు బాగా ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ఇంట్లో తయారుచేసిన లిచీ సీడ్ పౌడర్‌ను స్మూతీస్, పెరుగులో కలుపుకుని తినొచ్చు.

బరువును అదుపులో ఉంచుకోవడానికి లిచ్చి గింజలను కూడా తీసుకోవచ్చు.లిచ్చి గింజలు కడుపులో నులిపురుగుల సమస్యను దూరం చేయడంలో మీకు సహాయపడతాయి. శరీరంలో నొప్పిని తగ్గించే పెయిన్ రిలీవింగ్ గుణాలు లిచీ గింజల్లో ఉన్నాయి. తలనొప్పి విషయంలో లిచీ గింజల పేస్ట్‌ను తయారు చేసి తలకు పట్టించాలి. దీంతో తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. లిచ్చి గింజల నుండి తయారుచేసిన పొడిని ఉపయోగించడం ద్వారా జీర్ణ సమస్యలను నయం చేయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..