పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

|

May 17, 2021 | 9:46 PM

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా..

పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్... అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..
Fruits
Follow us on

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా.. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తుంటారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం ప్రతి రోజూ పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తేలింది. ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (ఐసియు) పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం పండ్లు, కూరగాయలు అధికంగా తినడం వలన ఒత్తిడిని నియంత్రించవచ్చు. క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం పండ్లు, కూరగాయలు తినడం వలన 25, 91 సంవత్సరాల మధ్య వయసు గల 8,600 మందికి పైగా ఆస్ట్రేలియన్ల ఒత్తిడి స్థాయిల మధ్య సంబంధాన్ని బేకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ నుండి ఆస్ట్రేలియన్ డయాబెటిస్, ఉబకాయం, జీవనశైలీని పరిక్షీంచారు.

రోజూ కనీసం 470 గ్రాముల పండ్లు, కూరగాయలు తిన్నవారిలో 230 గ్రాముల కన్నా తక్కువ తినేవారి కంటే 10 శాతం తక్కువ ఒత్తిడి స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలని సిఫారసు చేస్తుంది. ఈసీయూ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ రీసెర్చ్ నుంచి పీహెచ్ డీ అభ్యర్థి సిమోన్ రాడావెల్లి బాగటి మాట్లాడుతూ.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్న ఆహరం, మానసిక స్థితి మధ్య సంబంధాన్ని బలపరుస్తున్నట్లుగా తాజా అధ్యయనంలో వెలువడింది. తక్కువ పండ్లు, శాఖాహరం తీసుకునే వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందని.. అలాగే వీటిని ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు కనుగొన్నట్లు రాడావెల్లి చెప్పారు. మానసిక ఆరోగ్య సమస్య అనేది ప్రస్తుతం యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సమస్య. ఇద్దరు ఆస్ట్రేలియన్లలో ఒకరు వారి జీవితకాలంలో మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కోంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. రాడావెల్లి బాగాటి అంచనా ప్రకారం తాత్కలిక ఒత్తిడి సాధారణంగా తీసుకుంటారు. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి సమస్యను అధికంగా పరిగణిస్తారు. దీర్ఘకాలిక ఒత్తిడి సమస్య ఉన్నవారిలో గుండె జబ్బులు, మధుమేహం, నిరాశ, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను తగ్గించడానికి మార్గాలను కనుగోనాలని చెప్పారు. ఇటీవల అన్ని వయసుల వారి మీద జరిపిన అధ్యయనాల్లో పండ్లు, కూరగాయలు తగ్గించడం వలన ఒత్తిడి సమస్యను తగ్గించవచ్చని తేలింది. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన ఒత్తిడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయని అనే సందేహం వెనుక ఇప్పటికీ అస్పష్టంమైన కారణాలున్నాయి. కానీ ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయుడ్లు, కెరోటినాయుడ్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అందువలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెప్పారు. శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడి, ఆందోళన, మానసిక ఒత్తిడిని మరింత పెంచుతాయి. తాజా పరిశోధనల్లో మాత్రం పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన ఈ ఒత్తిడి సమస్యను నియంత్రించవచ్చని తేలింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి పోషకాహరం తీసుకోవడం ముఖ్యం.

Also Read: పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..