ప్రతిరోజూ పండ్లు తినడం వలన ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతుంటారు. శరీరానికి పండ్లు అనేక రకాలుగా మేలు చేస్తాయి. రోజుకు ఒక్కసారైనా పండ్లు తినాలని సూచిస్తుంటారు నిపుణులు.. అయితే కొందరు ఉదయం అల్పాహరంగా తీసుకుంటే.. మరికొందరు మధ్యాహ్నం.. సాయంత్రం తీసుకుంటారు.. కానీ పండ్లు ఏ సమయంలో తినాలనే విషయంపై మాత్రం చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి.. అందులో మధ్యాహ్నం 2 తర్వాత పండ్లు తినకూడదని చాలా మంది అనుకుంటారు. రాత్రిళ్లు పండ్లకు దూరంగా ఉండేవారు మరికొందరు.. ఇంతకీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పండ్లు తినాలా ? వద్దా ? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పండ్లు తినకూడదని కొందరు, నాలుగు గంటల తర్వాత తినకూడదని కొందరు అంటుంటారు.. మధ్యాహ్నం పూట పండ్లు తింటే బరువు పెరుగుతారని కొందరంటే, జీర్ణశక్తి చెడిపోతుందని నమ్మేవారి సంఖ్య అధికం.. దీని వల్ల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుందని, ఇది మధుమేహానికి దారితీస్తుందని అనుకుంటారు. కానీ పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు అనేకం ఉన్నాయి. పండ్లలో కేలరీలు ఎక్కువగా ఉండవు రాత్రిపూట అవి అంత ప్రమాదకరమైనవి కావు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు, ఫైబర్ అందిస్తాయి. నిద్రకు 3 గంటల ముందు పండ్లు లేదా ఏదైనా ఆహారాన్ని తినవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వలన నిద్ర బాగా రావడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..