Black Pepper: ఇది మసాలా కాదు..నల్ల బంగారం..! రోజూ తీసుకుంటే ఈ సమస్యలన్నీ మాయం..

|

Mar 12, 2024 | 12:44 PM

నల్లమిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నల్ల మిరియాలలోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. మహిళల్లో సాధారణ సమస్య అయిన

Black Pepper: ఇది మసాలా కాదు..నల్ల బంగారం..! రోజూ తీసుకుంటే ఈ సమస్యలన్నీ మాయం..
Black Pepper
Follow us on

భారతీయ మసాలా దినుసులలో ఒకటైన నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహార రుచిని పెంచే నల్ల మిరియాలను ‘బ్లాక్‌గోల్డ్‌’అని, ఆరోగ్య గని అని కూడా పిలుస్తారు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా నల్లమిరియాలను క్రమం తప్పకుండా వాడటం మహిళలకు వరం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. ముఖ్యంగా ఎండుమిర్చి వాడకం మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి, మహిళలకు నల్ల మిరియాలు ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అధిక రక్తపోటుతో బాధపడే మహిళలు నల్లమిరియాలను వాడటం వల్ల ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఇందుకోసం అరగ్లాసు నీటిలో కాస్త నల్లమిరియాల పొడిని కలుపుకుని తాగితే మంచిది. అలాగే, నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు కలిపి నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, గ్యాస్ , మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

నువ్వుల నూనెను వేడి చేసి అందులో నల్లమిరియాలు వేసి చల్లారిన తర్వాత ఈ నూనెతో కీళ్ల నొప్పుల ప్రాంతంలో మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో దీర్ఘకాలిక మంట హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలకు నెయ్యి, నల్ల మిరియాల పొడిని కలిపి వాడితే ఫలితం ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మహిళల్లో సాధారణ సమస్య అయిన బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది.

ఇవి కూడా చదవండి

నల్లమిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నల్ల మిరియాలలోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి