Rice And Roti: చాలామందికి భోజనంలో అన్నంతో పాటు రోటిని చేర్చుకోవడం అలవాటు. ప్లేట్‌లో రోటీ, అన్నం రెండూ ఉన్నప్పుడు ప్రజలు మొదట రోటీని చివరలో అన్నాన్ని తింటారు. అయితే ఎందుకు ఇలా చేస్తారు. ఇది సరైన నిర్ణయమా.. కాదా.. అనే విషయాల గురించి తెలుసుకుందాం.
కొంతమంది అన్నం, రోటీని కలిపి తినకూడదని అంటారు. ఎందుకంటే ఇవి రెండు సమతుల్య ఆహారాలు. రెండింటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెబుతారు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడుతాయని చెప్పారు. అయితే చాలామంది రోటీ, అన్నం కలిపి తినడాన్ని సరైనదిగా భావించారు. రెండు కలిపి తినడం వల్ల ఎటువంటి సమస్య లేదన్నారు. ఎందుకంటే రెండూ ఒకే ధాన్యం.. కేలరీలు కూడా రెండింటిలో ఒకే విధంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో శరీరం దానిని జీర్ణం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదని తెలిపారు.
కొందరు ఆరోగ్య నిపుణులు మాత్రం రెండు ధాన్యాలను కలపకూడదన్నారు. అంతేకాదు ఈ రెండింటిని తినేముందు కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్నారు. రెండు ఆహారాలు పేగులోకి ప్రవేశించినప్పుడు గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా విడుదలవుతుందని చెప్పారు. అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నందున ఈ రెండు ఆహారాలు జీర్ణం కావడం కొంచెం కష్టంతో కూడుకున్నపని అని సూచించారు. తద్వారా ఉబ్బరం సమస్య ఏర్పడుతుందన్నారు. మీరు మొదట అన్నం తిన్నప్పుడు మీ పొట్ట త్వరగా నిండిపోతుంది. ఆ తర్వాత మీరు రోటీ తినలేరు. అందుకే ప్రజలు ముందుగా రోటీ, తరువాత అన్నం తింటారు. ఇదే సరైన పద్దతి అని నిపుణులు పేర్కొంటున్నారు.