అప్పులు తీర్చడానికి ఏటీఎం చోరీ చేశాడు.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌! వీడియో

అప్పులు తీర్చడానికి ఏటీఎం చోరీ చేశాడు.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌! వీడియో

Phani CH

|

Updated on: Oct 12, 2021 | 10:20 PM

చేసిన అప్పులు తీరడం లేదు.. సంపాదన కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం తెలియక తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఇక దొంగతనం ఒక్కటే మార్గమనుకున్నాడు.

చేసిన అప్పులు తీరడం లేదు.. సంపాదన కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం తెలియక తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఇక దొంగతనం ఒక్కటే మార్గమనుకున్నాడు. ఏదో ఒక బ్యాంకు ఏటీఎం కొట్టేస్తే కష్టాలు తీరిపోతాయనుకున్నాడు. యూట్యూబ్‌లో ఏటీఎం చోరీ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎల్ఎన్ నగర్ కు చెందిన మోహన్ వ్యసనాలకు బానిసయ్యాడు. లక్షల్లో అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దాంతో బ్యాంకు చోరీకి సంబంధించిన ఓ వీడియో ఒకటి యూట్యూబ్‌లో చూశాడు. సులభంగా డబ్బు ఎలా కొల్లగొట్టాలోనని ఏటీఎం చోరీ వీడియోను సెర్చ్ చేశాడు. ఇక పని ప్రారంభించాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Petrol Bunk Fraud: పెట్రోల్ బంకుల్లో ‘మైక్రో చిప్‌’ మోసం.. కోట్లల్లో.. వీడియో

Viral Video: బాబోయ్‌! రూ.75 లక్షల కోట్లు విలువ చేసే ప్లాటినం నాణెం! ముద్రిస్తోంది ఏ దేశమో తెలుసా? వీడియో