ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు తింటే ఆ సమస్యలన్నీ మటాషే.

|

May 08, 2024 | 9:56 AM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, మనం రోజుని ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే కరివేపాకును నమలడం మంచి పద్ధతి.. అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దక్షిణ భారత వంటకంలో కరివేపాకు ఉండాల్సిందే..

ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు తింటే ఆ సమస్యలన్నీ మటాషే.
కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యం, అందానికి కలిగే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలున్నాయి.
Follow us on

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, మనం రోజుని ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే కరివేపాకును నమలడం మంచి పద్ధతి.. అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దక్షిణ భారత వంటకంలో కరివేపాకు ఉండాల్సిందే.. కూర అయినా పప్పు, పచ్చడి ఇలా అన్నింటిని కరివేపాకు సహాయంతో తయారుచేస్తారు.. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇంకా వంట రుచిని మరింత పెంచుతుంది. అయితే, కరివేపాకులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అందుకే.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాజా కరివేపాకులను నమిలి తింటే.. వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని.. ఇది శరీరానికి చాలా మంచిదని చెబుతున్నారు. కరివేపాకు ఆకులు నాలుగు ఉదయాన్నే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది: కరివేపాకును ఖాళీ కడుపుతో నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయం పూట ఏమీ తినకుండా తిన్నప్పుడు జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమై ప్రేగు కదలికలను సులభతరం చేస్తాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది.

మార్నింగ్ సిక్నెస్ నుంచి ఉపశమనం: ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మంది బలహీనత, తల తిరగడం, వాంతులు, వికారం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి లక్షణాలతో బాధపడుతున్న వారు.. కొన్ని కరివేపాకు ఆకులను నమిలితే, వారి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. ఇలా చేస్తే రిఫ్రెష్ గా ఉండటంతోపాటు మార్నింగ్ సిక్నెస్ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు..

బరువు తగ్గుతారు: ఊబకాయంతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కరివేపాకును నమలాలి. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీర నిర్విషీకరణ బాగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించవచ్చు. మీరు కూడా బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. పొట్ట కొవ్వును ఎలాగైనా తగ్గించుకోవాలనుకుంటే, కరివేపాకు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

జుట్టుకు మంచిది: కరివేపాకు జుట్టు రాలడాన్ని నిరోధించడంలో మీకు సహాయపడుతుంది. ఉదయం పూట ముందుగా ఒక గ్లాసు నీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత, మీరు కొన్ని తాజా కరివేపాకులను నమలవచ్చు. ఆకులను సరిగ్గా నమలి తినండి.. అల్పాహారం తీసుకునే 30 నిమిషాల ముందు తింటే చాలా మంచిది..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..