Millets in Winter: చిరుధాన్యాలతో ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు!
వీటిలో అధిక మోతాదులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో వాటికి దగ్గరయ్యి.. అనారోగ్యాలను దూరం చేసుకుంటున్నాడు. బరువు తగ్గాలన్నా, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, గ్లూకోజు అదుపులో ఉంచుకోవాలన్నా వీటి వంకే చూస్తున్నారు.
రోజంతా బిజిబిజీ.. జీవితం గజిబిజి.. ఉరుకులు పరుగులు.. క్షణం తీరిక లేని గమనాలు.. శారీరక శ్రమ తగ్గింది.. మానసిక ఒత్తిడి పెరిగింది. ఫలితంగా పాతికేళ్లకే బీపీ, షుగర్లు.. ముప్పైల్లోనే గుండెపై ముప్పేట దాడులు.. వెరసి మనిషి జీవితం తెగిన గాలిపటమే అవుతోంది. ఈ సమయంలో పాత రోజుల ఆహార నియమావళి వైపు మనిషి ఆకర్షితుడవుతున్నాడు. ఇప్పుడు తింటున్న వరి అన్నానికి బదులు ప్రాచీన కాలం నాటి తృణ ధాన్యాలు అదేనండి మన పరిభాషలో చిరుధాన్యాల వైపు మళ్లుతున్నాడు. వీటిలో అధిక మోతాదులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో వాటికి దగ్గరయ్యి.. అనారోగ్యాలను దూరం చేసుకుంటున్నాడు. బరువు తగ్గాలన్నా, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, గ్లూకోజు అదుపులో ఉంచుకోవాలన్నా వీటి వంకే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలంలో అధికంగా లభించే చిరుధాన్యాలు ఏంటి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుకుందాం..
చిరుధాన్యాలు.. రకాలు..
తృణధాన్యాల్లో దాదాపు పది రకాలకు పైగా ఈ చలికాలంలో మనకు విరివిగా లభిస్తాయి. వాటిలో ప్రధానమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, ఊదలు, సామలు, అండుకొర్రలు వంటివి ఎక్కువగా వినియోగిస్తారు.
ప్రయోజనాలివి..
అధిక సంఖ్యలో యాంటీ ఆక్సిడెంట్లు.. మిల్లెట్స్ లో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
రక్తంలో షుగర్ లెవల్స్.. ఫైబర్ అధికంగా ఉండే చిరుధాన్యాలు రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపు చేయడంలో సాయపడతాయి. సాధారణంగా దీనిలో గ్లెసిమిక్ ఇండెక్స్(జీఐ) షుగర్ స్థాయిలో పెరగకుండా అదుపు చేస్తుంది.
కొలెస్ట్రాల్ లెవల్స్.. మిల్లెట్స్ ఉండే ఫైబర్ శరీరంలో ఉండే కోలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపు చేస్తుంది. అలాగే దీనిలో ఉండే ప్రోటీన్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయపడుతుంది.
జీర్ణ ప్రక్రియకు.. చిరుధాన్యాలు మలబద్దకం, గ్యాస్ సమస్యలు, మొలలు వంటి వ్యాధులను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్.. ప్రోటీన్లు అధిక మోతాదులో ఉండే తృణధాన్యాలను మన రోజూ వారి ఫుడ్ జాబితాలో చేర్చితే అది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
బరువు తగ్గడంలో ఉపకారి..
శరీర బరువు తగ్గడానికి చిరుధాన్యాలు బెస్ట్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా అందే లో కేలరీలు, గ్లూటెన్ ఫ్రీ బరువు తగ్గడానికి ఉపకరిస్తాయి. అలాగే రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచడంతో పాటు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..