Kiwi Fruit : యాపిల్ కంటే ఐదు రెట్లు పోషకాలు కలిగిన ఈ పండు తింటే ప్రయోజనాలు ఎన్నో

|

Jun 16, 2021 | 3:10 PM

Kiwi Fruit : విదేశాల్లో పాండే కివి పండు మనదేశంలో అడుగు పెట్టింది. కివీ పండు న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు..

Kiwi Fruit : యాపిల్ కంటే ఐదు రెట్లు పోషకాలు కలిగిన ఈ పండు తింటే ప్రయోజనాలు ఎన్నో
Kiwi
Follow us on

Kiwi Fruit : విదేశాల్లో పాండే కివి పండు మనదేశంలో అడుగు పెట్టింది. కివీ పండు న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. గత కొంతకాలంగా భారతీయ దేశంలో మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు ‘విటమిన్‌ సి’, ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ‘కివీ’ పండు. న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి .

*కివి పండు బరువును తగ్గిస్తుంది.
*జిర్ణ వ్యవస్థ ను శుభ్రం చెస్తుంది.
*రోగి నిరోధక శక్తిని పెంచుతుంది.
*రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
* రక్తం పొటు ను తగ్గిస్తుంది.
*రక్తం నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.
* కివీలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది గుండె కు మంచిది.
* రక్తం లో చెక్కర శాతం ని తగ్గిస్తుంది.
* మలబద్ధకం నివారణకు ఉపయౌగపడుతుంది.
*దీనిలో పీచు అధికంగా ఉంటుంది.
*కొన్ని రకాల జన్యు మార్పులును నివరినివారిస్తుంది.
*క్యాన్సర్ ను నివారిస్తుంది.
*కంటి సంబంధించిన వ్యాధులు ను నివారిస్తుంది.

Also Read: మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే విటమిన్ బి 12 లోపమేమో..