Kitchen Tips: పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువ వేసేశారా? ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే టేస్ట్ అదుర్స్‌..

| Edited By: Anil kumar poka

Jan 10, 2023 | 12:46 PM

సొంత వారు అయితే ముఖం మీదే ఉప్పు ఎక్కువైందని తిట్టిపోస్తుంటారు. ఇలా వంటలో ఉప్పు ఎక్కువ వేయడం భార్యభర్తలు గొడపడిన సందర్భాలు కోకొల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే వంటలో ఉప్పు ప్రాధాన్యం చాలా ఉంటుంది.

Kitchen Tips: పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువ వేసేశారా? ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే టేస్ట్ అదుర్స్‌..
Indian Curries
Follow us on

మనం ఎంత ఆహారం తిన్నా నోటికి రుచి అనిపిస్తేనే తింటాం. వంటల్లో ఎన్ని రకాలు పెట్టినా అన్నింటికి రుచినందించేది ఉప్పే. అవును ఉప్పు వంటకాన్ని బ్రహ్మాండంగా మార్చేయగలదు..అలాగే ఉప్పు ఎక్కువైనా వంటకం రుచిని నాశనమూ చేయగలదు. కాబట్టి వంట చేసే వాళ్లు ఉప్పు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వంట చేసేవారు, గృహిణులు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటారు. ఆ విషయాన్ని భర్తకు లేదా తినేవారికి చెప్పలేక సతమతమవుతుంటారు. భోజనం చేసిన వారు మాట తీయలేక బాగుంది అని చెప్పినా.. ఉప్పు ఎక్కువైందని తెలుస్తుంటుంది. అయితే సొంత వారు అయితే ముఖం మీదే ఉప్పు ఎక్కువైందని తిట్టిపోస్తుంటారు. ఇలా వంటలో ఉప్పు ఎక్కువ వేయడం భార్యభర్తలు గొడపడిన సందర్భాలు కోకొల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే వంటలో ఉప్పు ప్రాధాన్యం చాలా ఉంటుంది. అయితే వంటలో ఉప్పు ఎక్కువైనప్పుడు సింపుల్ టెక్నిక్స్ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి చూద్దాం.

నిమ్మరసం

కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే ఉప్పు సరిపోయే చాన్స్ ఉంది. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే యాసిడ్స్ ఉప్పు రుచిని తగ్గించే అవకాశం ఉంటుంది. నిమ్మరసం ఒకటే కాకుండా యాపిల్ సైడర్ వెనిగర్, టమాటో సాస్, టమాటో రసం కూడా ఉప్పు ఎక్కువైన సందర్భంగా వాడవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కూరంతా చల్లారక గానీ ఇవి వేయకూడదు. ఎందుకంటే వేడి వల్ల కూర మొత్త చిరు చేదు వచ్చి పాడయ్యే అవకాశం ఉంది. 

క్రీమ్ ఉత్పత్తులు

వంటకాల్లో ఉప్పు ఎక్కువైన సందర్భంలో క్రీమ్ ఉత్పతులను వాడడం వల్ల కూడా మంచి ఫలితముంటుంది. సోర్ క్రీమ్, అవకాడో, రికోటా చీజ్ వంటి ఉత్పత్తులు వంటకానికి జోడిస్తే ఉప్పదనం కొంచెం తగ్గుతుంది. అలాగే ఉప్పు ఎక్కువైన సందర్భంలోనే కాదు కారం కూడా బాగా ఎక్కువైన సందర్భంగా ఈ పద్ధతిని అవలంభిచ్చవచ్చని నిపుణుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి

పాల ఉత్పత్తులు

కూరలో ఉప్పు ఎక్కువైన సందర్భంలో పెరుగు కానీ, కొన్ని చిక్కటి పాలు యాడ్ చేస్తే కూర మృధువుగా ఉడకడమే కాక ఉప్పదనం కూడా తగ్గుతుంది. పాలల్లో ఉండే చక్కెర ఉప్పు రుచిని తగ్గించడంలో సాయం చేస్తుంది. అలాగే కొబ్బరి పాలు యాడ్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి.

ఉడికించిన బంగాదుంపలు

వంటకంలో ఉప్పు మరీ ఎక్కువైన సందర్భంలో బంగాళదుంపలను ఉడికించి మెత్తటి పేస్ట్ లా చేసి కూరలో కలిపితే ఉప్పు సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇది ప్రతిసారి ఆడవారు వాడే సింపుల్ చిట్కా. కానీ బంగాళదుంపలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. 

చక్కెర

కొన్ని వంటకాల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు చక్కెరను వాటితో తీయ్యదనంతో ఉప్పు సమస్య తగ్గుతుంది. ఇది కొద్దిపాటి ఉప్పు ఎక్కువైనప్పుడు ఈ చిట్కా సూపర్ గా పని చేస్తుంది. ఓవర్ సాల్టెడ్ ఫుడ్ ను న్యూట్రలైజ్ చేయడానికి సాయం చేస్తుందిన అలాగే కూరకు మంచి టేస్టీగా ఉంటుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..