Bisi Bele Bath Recipe: కర్ణాటక స్టైల్ లో ఈజీగా టేస్టీగా బిసిబెల్ బాత్ తయారీవిధానం

|

Jul 29, 2021 | 3:07 PM

Bisi Bele Bath Recipe: రోజూ తినే వంటలతో బోర్ కొడుతుంటే.. డిఫరెంట్ స్టైల్ లో వంటలు చేయడానికి ఆసక్తిని చూపిస్తాం.. బిర్యానీలో ఎన్ని రకాలున్నా.. తెలుగువారికి పులిహోర..

Bisi Bele Bath Recipe: కర్ణాటక స్టైల్ లో ఈజీగా టేస్టీగా బిసిబెల్ బాత్ తయారీవిధానం
Bisi Bele Bath
Follow us on

Bisi Bele Bath Recipe: రోజూ తినే వంటలతో బోర్ కొడుతుంటే.. డిఫరెంట్ స్టైల్ లో వంటలు చేయడానికి ఆసక్తిని చూపిస్తాం.. బిర్యానీలో ఎన్ని రకాలున్నా.. తెలుగువారికి పులిహోర ఎంత ఇష్టమో.. కర్ణాటక వారికీ బిసిబెల్ బాత్ అంటే అంత ఇష్టం..ఈ రోజు రుచికరమైన బిసిబెల్ బాత్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు :

అన్నం- రెండు కప్పులు
కందిపప్పు-ఒక కప్పు
ధనియాలు-ఒక స్పూన్
మిరియాలు – 4
శనగపప్పు- రెండు స్పూన్స్
వేరుశనగపప్పు
ఆవాలు,జీలకర్ర – 1 స్పూన్
మెంతులు – 1/2 స్పూన్
ఎండుమిర్చి – రెండు
చింతపండు – కొద్దిగా
క్యారెట్ – ఒకటి
అనపకాయముక్కలు – కొన్ని
ఉల్లిపాయ – ఒకటి
ములక్కాడ – ఒకటి
కరివేపాకు
కొత్తిమీర తరుగు- కొంచెం
కొబ్బరి తురుము – ఒక స్పూన్
జీడిపప్పు
ఇంగువ – చిటికెడు
బెల్లం – చిన్న ముక్క
నెయ్యి కొంచెం

తయారీ విధానం:

ముందుగా కుక్కర్ స్టౌ మీద పెట్టుకుని కందిపప్పు, క్యారెట్, ములక్కాడ, ఆనపకాయ, ఉల్లిపాయ ముక్కలు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని శనగపప్పు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటికీ కొబ్బరి కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత చింతపండు రసం తీసుకుని ఆ గ్రైండ్ చేసిన పొడికి కలిపి పక్కన పెట్టుకుని.. ఒక గిన్నెతీసుకుని స్టౌ మీద పెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసంలో గ్రైండ్ చేసిన ముద్దా కలిపి ,ఉడికించిన పప్పు,కూర ముక్కలు, ఉప్పు, బెల్లం కలిపి సాంబార్ కాచుకోవాలి సాంబార్ లో ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం నెయ్యి వేసుకుని వేడి ఎక్కిన తర్వాత ఆవాలు. జీలకర్ర వేసి వేయించాలి.. తర్వాత వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిటికెడు ఇంగువ వేయించాలి. అనంతరం ఈ పోపు గిన్నెలోకి సాంబార్ అన్నం వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు కలపాలి. అంతే టేస్టీ టేస్టీ బిసిబెల్ బాత్ బాత్ రెడీ

Also Read:  ఫీజుల కోసమే స్కూల్స్ రీపెన్ అంటున్న పేరెంట్స్ … ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్న