Kara Bath Recipe: రవ్వతో ఉప్మా అంటే బోర్ కొడుతోందా? అయితే ఈ కర్ణాటక స్టైల్ ‘కారా బాత్’ ట్రై చేయండి!

చాలా ఇళ్లలో ఉదయం అల్పాహారం అంటే ఇడ్లీ లేదా దోశ ఉంటుంది. ఒకవేళ మార్పు కోసం ఉప్మా చేయాలని అనుకున్నా, చాలా మంది ముఖం చిట్లిస్తుంటారు. కానీ, అదే రవ్వతో కర్ణాటక స్టైల్‌లో 'కారా బాత్' చేస్తే మాత్రం ఎవరూ కాదనలేరు. అల్లం, నిమ్మరసం, తాజా కూరగాయలు సాంబార్ పొడి కలయికతో తయారయ్యే ఈ వంటకం రుచిలో అద్భుతంగా ఉంటుంది. కర్ణాటకలోని చిన్న చిన్న హోటళ్ల నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు ఇది ఎంతో పాపులర్.

Kara Bath Recipe: రవ్వతో ఉప్మా అంటే బోర్ కొడుతోందా? అయితే ఈ కర్ణాటక స్టైల్ కారా బాత్ ట్రై చేయండి!
Kara Bath Recipe

Updated on: Jan 24, 2026 | 6:31 PM

కారా బాత్ రుచిగా రావడానికి అందులో వాడే సాంబార్ పొడి, నెయ్యి’ ప్రధాన కారణం. కూరగాయల పోషకాలు రవ్వలోని కార్బోహైడ్రేట్లు కలిసి దీనిని ఒక సంపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్‌గా మారుస్తాయి. పెళ్లిళ్లలో వడ్డించే రవ్వ కిచిడీకి సమానమైన రుచిని ఇచ్చే ఈ వంటకాన్ని కేవలం 20 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో, ఆ సీక్రెట్ ఇంగ్రిడియంట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

రవ్వ (సెమోలినా) – 1 కప్పు

నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు, మినపప్పు,

జీడిపప్పు, కరివేపాకు

కూరగాయలు: ఉల్లిపాయ,

క్యారెట్,

పచ్చి బఠానీలు,

టమోటా,

క్యాప్సికం

మసాలాలు: పసుపు, సాంబార్ పొడి (ముఖ్యమైనది), ఉప్పు

ఫ్లేవర్ కోసం: అల్లం తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం

తయారీ విధానం:

మొదట రవ్వను మీడియం మంట మీద రంగు మారకుండా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

పాన్ లో నెయ్యి వేడి చేసి ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించాలి.

తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, బఠానీలు, క్యాప్సికం టమోటాలు వేసి 2 నిమిషాలు వేయించి, మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి.

ఇందులో సాంబార్ పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

1 కప్పు రవ్వకు 2 కప్పుల నీరు పోసి బాగా మరిగించాలి.

నీరు మరుగుతున్నప్పుడు మంట తగ్గించి, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.

నీరంతా ఇంకిపోయి మెత్తగా ఉడికాక, స్టవ్ ఆపేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం కొద్దిగా నెయ్యి పైన చల్లుకుంటే వేడి వేడి కారా బాత్ రెడీ!