
పెళ్ళిళ్ళు, పార్టీల్లో మాత్రమే కాదు ప్రత్యేక సందర్భాల్లో కూడా పనసకాయ బిర్యానీ ప్రత్యేక వంటకంగా స్థానం సంపాదించుకుంది. శాఖాహారులు అయితే బిర్యానీ తినడానికి ఇష్టపడితే .. జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఒక గొప్ప ఎంపిక. పనస కాయ బిర్యానీ రుచి వెజ్ బిర్యానీ లో.. నాన్-వెజ్ వెర్షన్‌గా అనిపిస్తుంది. పనసకాయ బిర్యనీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రోజు రెసిపీ తెలుసుకుందాం.. మీరు ఒకసారి ప్రయత్నిస్తే.. పనస కాయ దొరికినప్పుడల్లా మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు.
పనస కాయ ముక్కలు – 500 గ్రాములు (కడిగి ముక్కలుగా కోయాలి)
బాస్మతి బియ్యం – 2 కప్పులు
పెరుగు – 1 కప్పు
ఉల్లిపాయ – 2 సన్నగా తరిగినవి
టమోటా – 1 ముక్కలుగా కోయాలి
పచ్చిమిర్చి – 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
పుదీనా, కొత్తిమీర – అర కప్పు చొప్పున
నిమ్మరసం – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
పసుపు – ½ టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
బే ఆకులు- రెండు
దాల్చిన చెక్క- చిన్న ముక్క
లవంగాలు – నాలుగు
ఉప్పు – రుచి కి సరిపడా
నూనె, నెయ్యి – బిర్యానికి సరిపడా
దశలవారీగా పనస కాయ బిర్యానీ తయారీ విధానం
స్టెప్ 1 : బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టి.. తర్వాత ఒక గిన్నె తీసుకుని బాస్మతి బియ్యం తగినన్ని నీరు, కొంచెం ఉప్పు, మసాలా దినుసులు వేసి 80% వరకు ఉడికించండి.
స్టెప్ 2: స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి..శుభ్రం చేసుకున్న పనస కాయ ముక్కలను వేసి నీరు కొంచెం మెత్తగా అయ్యేలా ఉడికించండి. తర్వాత వీటిని నీరు పోయేలా వేరు చేసి పక్కకు పెట్టుకోవాలి.
స్టెప్ 3: స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నూనె వేసి ఉడికించుకున్న పనస ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
స్టెప్ 4: పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
స్టెప్ 5 ఇదే మిశ్రమంలో టమోటాలు ముక్కలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు వేసి మసాలా బాగా ఉడికించాలి. ఇప్పుడు వేయించిన జాక్‌ఫ్రూట్ వేసి 10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
స్టెప్ 6: ఇప్పుడు బిర్యానీ చేసేందుకు ఒక దళసరి గిన్నెను తీసుకుని స్టవ్ మీద పెట్టి.. కొంచెం నెయ్యి, నూనె వేసి ముందుగా బిర్యానీ పాత్రలో మసాలా దినుసుల మిశ్రమాన్ని వేయండి.. తరువాత రెడీ చేసుకున్న బాస్మతి బియ్యం వేయండి. పైన కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వీసి, నిమ్మరసం జోడించండి. ఇలా గిన్నెలో రెండు లేదా మూడు పొరలుగా బిర్యానీని వేసి.. తర్వాత బిర్యానీ గిన్నె మీద మూత పెట్టండి.
స్టెప్ 7: ఆవిరి బయటకు రాకుండా చేసి తక్కువ మంట మీద మరో 15 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే పనసకాయ బిర్యానీని రెడీ. దీనిని రైతాతో వేడి వేడిగా వడ్డించండి. ఇది మటన్ బిర్యానీ లాగా రుచిగా ఉంటుంది
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..