
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మోమోస్ మేనియా కనపడుతోంది. ఈ టిబెటన్ వంటకాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన డిష్ గా కూడా మారిపోయింది. ఆవిరితో ఉడికించిన డంప్లింగ్‌లు కూరగాయలతో నింపి రుచికరమైన చట్నీతో సర్వ్ చేస్తుంటారు. అయితే, బయట వీటిని తినడం అన్నిసార్లు అంత ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఇంట్లోనే సులభంగా వెజ్ మోమోస్ తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం.
పిండి కోసం:
గోధుమపిండి (మైదా) – 1 కప్పు
ఉప్పు – చిటికెడు
నీరు – అవసరమైనంత
నూనె – 1 టీస్పూన్
పూరణం కోసం:
తరిగిన క్యారెట్ – 1/2 కప్పు
తరిగిన క్యాబేజీ – 1/2 కప్పు
తరిగిన బీన్స్ – 1/4 కప్పు
తరిగిన ఉల్లిపాయ – 1/4 కప్పు
తరిగిన అల్లం – 1 టీస్పూన్
వెల్లుల్లి (తరిమినది) – 1 టీస్పూన్
సోయా సాస్ – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – 1/2 టీస్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
టమాటో – 2 (తరిగినవి)
ఎండుమిర్చి – 3-4
వెల్లుల్లి – 3 రెబ్బలు
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – 1/4 కప్పు
తయారీ విధానం:
ఒక గిన్నెలో మైదా, ఉప్పు, నూనె వేసి, నీరు కలుపుతూ మెత్తగా పిండిని కలపండి.
పిండిని మూతపెట్టి 20-30 నిమిషాలు నాననివ్వండి.
పాన్‌లో నూనె వేడి చేసి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించండి.
తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, బీన్స్ వేసి 5-7 నిమిషాలు ఉడికించండి.
సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఫిల్లింగ్ సిద్ధం.
పిండిని చిన్న ఉండలుగా చేసి, సన్నగా చపాతీలా చుట్టండి.
ప్రతి చపాతీ మధ్యలో ఒక టీస్పూన్ పూరణం వేసి, కావలసిన ఆకారంలో మడవండి (గుండ్రంగా లేదా అర్ధచంద్రాకారంలో).
ఆవిరి ఉడికించే పాత్రలో 10-12 నిమిషాలు ఉడికించండి.
టమాటో, ఎండుమిర్చి, వెల్లుల్లిని నీటితో కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి.
ఉప్పు కలిపి, చిన్న మంటపై 5 నిమిషాలు ఉడికించండి. చట్నీ సిద్ధం.
వేడి వేడి మోమోస్‌ను టమాటో చట్నీతో సర్వ్ చేయండి. ఈ రుచికరమైన కూరగాయల మోమోస్ మీ కుటుంబానికి, స్నేహితులకు ఖచ్చితంగా నచ్చుతాయి!