Pomfret Fish Fry: పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

|

Apr 20, 2024 | 5:07 PM

నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చేపలు కూడా ఒకటి. చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపలతో పులుసు, వేపుడు, ఇగురు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. చేపల్లో పాంఫ్రేట్ ఫిస్ కూడా ఒకటి. ఈ చేపకు ఒకటే ఒక పెద్ద ముల్లు మాత్రమే ఉంటుంది. వీటితో ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. సైడ్‌ డిష్‌గా, స్టాటర్‌గా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్లలో ఎక్కువగా ఈ ఫిష్ దొరుకుతుంది. దీన్ని ఇంట్లో కూడా మనం సింపుల్‌గా..

Pomfret Fish Fry: పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
Pomfret Fish Fry
Follow us on

నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చేపలు కూడా ఒకటి. చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపలతో పులుసు, వేపుడు, ఇగురు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. చేపల్లో పాంఫ్రేట్ ఫిస్ కూడా ఒకటి. ఈ చేపకు ఒకటే ఒక పెద్ద ముల్లు మాత్రమే ఉంటుంది. వీటితో ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. సైడ్‌ డిష్‌గా, స్టాటర్‌గా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్లలో ఎక్కువగా ఈ ఫిష్ దొరుకుతుంది. దీన్ని ఇంట్లో కూడా మనం సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాంఫ్రేట్ చేప ఫ్రై ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాంఫ్రేట్ చేప ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

పాంఫ్రేట్ చేప, కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మ రసం, శనగ పిండి, బొంబాయి రవ్వ, మిరియాల పొడి, ఆయిల్.

పాంఫ్రేట్ చేప ఫ్రై తయారీ విధానం:

ముందుగా పాంఫ్రేట్ చేపను శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, పెరుగు వేసి క్లీన్ చేస్తే.. నీచు వాసన పోతుంది. ఆ తర్వాత మరో బౌల్‌లో పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మ రసం, శనగ పిండి, బొంబాయి రవ్వ, మిరియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేపకు రెండు వైపులా బాగా పట్టించాలి. కనీసం ఓ గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రిల్ లేదా కడాయి తీసుకోవాలి. ఆయిల్ వేసి వేడి చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆయిల్ వేడెక్కాక.. కరివేపాకులు, మ్యారినేట్ చేసుకున్న చేపను వేసి మీడియం మంటపై ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేసి చేపను మరో వైపు తిప్పు కోవాలి. ఇలా నెమ్మదిగా చేపను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ చేపను ఫ్రై చేసుకోవడానికి ఎలా లేదన్నా 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇలా రెండు వైపులా చేపను వేయించుకున్నాక.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఆరగించడమే. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.