Meal Maker 65: చిటికెలో అయిపోయే మీల్ మేకర్ 65.. నాన్ వెజ్‌కి తగ్గని రుచి..

| Edited By: Ram Naramaneni

Oct 27, 2024 | 9:48 PM

మన నిత్యవసర వస్తువుల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. దీన్నే సోయా అని పిలుస్తూ ఉంటారు. మీల్ మేకర్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ప్రోటీన్ కావాలి అనుకునేవారు ప్రతి రోజూ మీల్ మేకర్ తినడం చాలా మంచిది. భారత దేశ వ్యాప్తంగా కూడా మీల్ మేకర్ తినేవారు చాలా మంది ఉన్నారు. మీల్ మేకర్ ఉపయోగించి ఎన్నో వందల రకాల రెసిపీలు..

Meal Maker 65: చిటికెలో అయిపోయే మీల్ మేకర్ 65.. నాన్ వెజ్‌కి తగ్గని రుచి..
Meal Maker 65
Follow us on

మన నిత్యవసర వస్తువుల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. దీన్నే సోయా అని పిలుస్తూ ఉంటారు. మీల్ మేకర్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ప్రోటీన్ కావాలి అనుకునేవారు ప్రతి రోజూ మీల్ మేకర్ తినడం చాలా మంచిది. భారత దేశ వ్యాప్తంగా కూడా మీల్ మేకర్ తినేవారు చాలా మంది ఉన్నారు. మీల్ మేకర్ ఉపయోగించి ఎన్నో వందల రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా వెజిటేరియన్. కాబట్టి నాన్ వెజ్ తినని వారు ఇది తింటే పూర్తి పోషకాలు లభిస్తాయి. ఇలా మీల్ మేకర్‌తో తయారు చేసే వంటల్లో మీల్ మేకర్ 65 కూడా ఒకటి. చాలా మంది బయట హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్స్‌లో తినే ఉంటారు. కానీ ఈ స్నాక్‌ని ఇంట్లో కూడా ఎంతో రుచిగా తయారు చేసుకుని తినవచ్చు. మరి ఈ మీల్ మేకర్ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేకర్ 65కి కావాల్సిన పదార్థాలు:

మీల్ మేకర్, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిర్చి, నిమ్మరసం, ఆయిల్.

మీల్ మేకర్ 65 తయారీ విధానం:

ముందుగా మీల్ మేకర్‌ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటిలో ఓ అర గంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, కారం పొడి, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేయాలి. ఇప్పుడు ఈ పేస్టును మీల్ మేరకు బాగా పట్టించాలి. ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం కూడా పిండాలి. ఇలా ఓ పావు గంట సేపు పక్కన పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కగానే.. కలిపి పెట్టిన వాటిని వేసి అన్ని వైపులగా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని టిష్యూ పేపర్ మీదకు తీసుకుంటే ఆయిల్ మొత్తం లాగుతుంది. ఆ తర్వాత అదే కడాయిలో ఓ జల్లెడ గరిటెలో జీడిపప్పు, పచ్చి మిర్చి, కరివేపాకు వేయించుకుని మీల్ మేకర్ పై వేయాలి. ఉల్లి ముక్కలు కూడా వేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ 65 సిద్ధం. వీటిని గ్రీన్ చట్నీ, లేదంటే టమాటా సాస్‌తో తింటే ఆహా చాలా రుచిగా ఉంటాయి.