Carrot Soup: శక్తిని, అందాన్ని పెంచే క్యారెట్ సూప్.. ఈ స్టైల్‌లో చేస్తే అదుర్స్..

| Edited By: Ravi Kiran

Oct 12, 2024 | 9:16 PM

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇలా క్యారెట్‌తో కూడా సూప్ తయారు చేస్తారు. ఈ సూప్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ ఇదే తయారు చేస్తారు. ఈ సూప్ అంత రుచిగా ఉంటుంది. రెగ్యులర్ సూప్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అందులోనూ క్యారెట్ కాబట్టి.. ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా మంచిది. ఈ సూప్ ని తక్కువ సమయంలోనే..

Carrot Soup: శక్తిని, అందాన్ని పెంచే క్యారెట్ సూప్.. ఈ స్టైల్‌లో చేస్తే అదుర్స్..
Carrot Soup
Follow us on

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇలా క్యారెట్‌తో కూడా సూప్ తయారు చేస్తారు. ఈ సూప్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ ఇదే తయారు చేస్తారు. ఈ సూప్ అంత రుచిగా ఉంటుంది. రెగ్యులర్ సూప్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అందులోనూ క్యారెట్ కాబట్టి.. ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా మంచిది. ఈ సూప్ ని తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇంత రుచిగా ఉండే సూప్‌ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

క్యారెట్లు, వెల్లుల్లి, బటర్, ఆయిల్, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కూరగాయలు ఉడికించిన నీళ్లు, మిరియాల పొడి.

క్యారెట్ సూప్ తయారీ విధానం:

ముందుగా క్యారెట్‌ శుభ్రంగా కడిగి ఆయిల్ రాసి బేకింగ్ షీట్‌లో పెట్టి బేక్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ మీద కూడా చిన్న మంట మీద కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ కొద్దిగా, బటర్ కొద్దిగా వేసి వెల్లుల్లి తరుగు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఉప్పు, జీరా పొడి, ధనియా పొడి కూడా వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కూరగాయలు ఉడికించిన నీళ్లు వేసుకున్నా మంచిదే. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్న క్యారెట్‌ను తురిమి ముద్దగా చేసి.. మరుగుతున్న నీటిలో ఉడికించాలి. ఇలా నేరుగా తాగాలి అనుకునేవారు తాగేయవచ్చు. లేదు అన్నవాళ్లు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసి చిక్కని పేస్టులా చేయాలి. చివరలో కొద్దిగా బటర్, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ సూప్ సిద్ధం.