Temple Chakkara Pongal: టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..

| Edited By: Ram Naramaneni

Oct 06, 2024 | 10:01 PM

తెలుగు వంటకాల్లో చక్కెర పొంగలికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంట్లో ఎలాంటి శుభ కార్యాలు మొదలు పెట్టినా ముందుగా చేసేది చక్కెర పొంగలే. ఈ చక్కెర పొంగలిని ఒక్కొక్కరు ఒక్కో స్టైలో చేస్తూ ఉంటారు. ప్రాంతాలను బట్టి కూడా ఈ రుచి వేరుగా ఉంటుంది. ఇంట్లో ఏమైనా పండుగలు, శుభకార్యాలకు ఈ చక్కెర పొంగలి తయారు చేసి భగవంతుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. చక్కెర పొంగలికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వేడి వేడి అలా తింటూ ఉంటే..

Temple Chakkara Pongal: టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
Temple Style Chakkara Pongal
Follow us on

తెలుగు వంటకాల్లో చక్కెర పొంగలికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంట్లో ఎలాంటి శుభ కార్యాలు మొదలు పెట్టినా ముందుగా చేసేది చక్కెర పొంగలే. ఈ చక్కెర పొంగలిని ఒక్కొక్కరు ఒక్కో స్టైలో చేస్తూ ఉంటారు. ప్రాంతాలను బట్టి కూడా ఈ రుచి వేరుగా ఉంటుంది. ఇంట్లో ఏమైనా పండుగలు, శుభకార్యాలకు ఈ చక్కెర పొంగలి తయారు చేసి భగవంతుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. చక్కెర పొంగలికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వేడి వేడి అలా తింటూ ఉంటే.. నోట్లో కరిగిపోతూ ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంతగా దీని రుచి ఉంటుంది. అందులోనూ టెంపుల్‌ స్టైల్‌లో చేసే చక్కెర పొంగలి రుచే వారు. మరి ఈ రుచిని మనం ఇంట్లో కూడా ఆస్వాదించవచ్చు. టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలిని ఎలా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు:

పాలు, అరటి పండు, పెసర పప్పు, బియ్యం, చక్కెర, నేయ్యి, యాలకుల పొడి, జీలకర్ర, డ్రై ఫ్రూట్స్.

టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి తయారీ విధానం:

ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పెసర పప్పును మిక్సీలో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బియ్యాన్ని నీళ్లతో పాటు ఉడకబెట్టాలి. అన్నం ఉడికిన తర్వాత పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక.. కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత ఇందులో మిక్సీ పట్టిన పెసరపప్పు మిశ్రమం వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇది ఓ రెండు నిమిషాలు వేయించాక.. ఆ తర్వాత బియ్యం, అరటి పండు ముక్కలు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ అన్నం కొద్దిగా ఉడుకుతుండగా.. పాలు, పంచదార వేసి మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలి. పంచదారకు బదులు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత యాలకుల పొడి కలపాలి. చివరగా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. అయితే చక్కెర పొంగలిని ఒక్కోలా తింటే ఒక్కో రుచి వస్తుంది.