Ragi Carrot Chapati: హెల్దీ ఫుడ్ తినాలి అనుకునేవారికి ఇది బెస్ట్.. రాగి క్యారెట్ చపాతీ..

| Edited By: Shaik Madar Saheb

Jul 09, 2024 | 9:19 PM

చపాతీలు అంటే చాలా మందికి ఇష్టం. చపాతీలతో ఎలాంటి కూరలు అయినా తినేయవచ్చు. ఎన్ని సార్లు తిన్నా చపాతీలు ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు చపాతీలను తింటూ ఉంటారు. చపాతీలు కూడా లిమిట్‌లో తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. చపాతీలను మరింత హెల్దీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. చపాతీలను ప్లెయిన్‌గా కాకుండా వీటిల్లో ఆకు కూరలు..

Ragi Carrot Chapati: హెల్దీ ఫుడ్ తినాలి అనుకునేవారికి ఇది బెస్ట్.. రాగి క్యారెట్ చపాతీ..
Ragi Carrot Chapati
Follow us on

చపాతీలు అంటే చాలా మందికి ఇష్టం. చపాతీలతో ఎలాంటి కూరలు అయినా తినేయవచ్చు. ఎన్ని సార్లు తిన్నా చపాతీలు ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు చపాతీలను తింటూ ఉంటారు. చపాతీలు కూడా లిమిట్‌లో తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. చపాతీలను మరింత హెల్దీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. చపాతీలను ప్లెయిన్‌గా కాకుండా వీటిల్లో ఆకు కూరలు, బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిని కలిపి తినవచ్చు. ఇలా మీ ముందుకు రాగి క్యారెట్ చపాతీ తీసుకొచ్చాం. రాగులు, క్యారెట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ రాగి క్యారెట్ చపాతీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాగి క్యారెట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి, క్యారెట్ తురుము, గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి లేదా బటర్, నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తి మీర.

రాగి క్యారెట్ తయారీ విధానం:

ముందుగా ఓ కడాయి పెట్టి అందులో కొద్దిగా రాగి పిండి వేసి వేయించాలి. దీన్ని ఓ బౌల్ లోకి తీసుకోండి. రాగి పిండి తీసుకున్నట్టే గోధుమ పిండి కూడా తీసుకోండి. క్యారెట్‌ను నేరుగా పచ్చిగా అయినా రాగి పిండిలో వేసుకోవచ్చు. లేదంటే కాస్త ఫ్రై చేసుకుని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు క్యారెట్‌ని తురమి దీనికి జీలకర్ర, ఆవాలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు కొత్తి మీర వేసి పోపు పెట్టి.. ఓ పది నిమిషాల వరకూ వేయించండి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారాక.. రాగి పిండిలో వేసి మొత్తం అన్నీ కలుపుకోవాలి. అవసరం అయితే నీటిని కొద్దిగా వేస్తూ పిండిని కలపండి.

ఇప్పుడు చిన్న చిన్న ముద్దలను తీసుకుంటూ చపాతీల్లా వత్తుకుని.. పాన్ పై వేసి రెండు వైపులా నెయ్యి లేదా బటర్‌తో కాల్చుకోండి. ఆయిల్ తో కూడా కాల్చుకోవచ్చు. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత.. ఓ ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే రాగి క్యారెట్ చపాతీ సిద్ధం. దీన్ని నేరుగా అయినా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే పుదీనా చట్నీ, టమాటా చట్నీ, నాన్ వెజ్ కర్రీస్‌తో కూడా తినవచ్చు.