Phool Makhana chaat: పూల్ మఖానాతో ఇలా చాట్ చేయండి.. పిల్లలు ఇష్ట పడి మరీ తింటారు!

|

Aug 03, 2024 | 11:52 PM

పూల్ మఖానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. మఖానా తింటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని చాలా మంది ఇష్ట పడి మరీ తింటారు. పూల్ మఖానాతో వెరైటీ కర్రీలు తయారు చేసుకోవచ్చు. అయితే వీటితో చాట్ కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు హెల్దీ స్నాక్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు..

Phool Makhana chaat: పూల్ మఖానాతో ఇలా చాట్ చేయండి.. పిల్లలు ఇష్ట పడి మరీ తింటారు!
ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారికి మఖానా మేలు చేయదు. ఎందుకంటే దీనిని నూనె, మసాలాలతో కలిపి వండుతారు. ఫలితంగా దీన్ని తినడం వల్ల ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం సమస్య పెరుగుతుంది.
Follow us on

పూల్ మఖానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. మఖానా తింటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని చాలా మంది ఇష్ట పడి మరీ తింటారు. పూల్ మఖానాతో వెరైటీ కర్రీలు తయారు చేసుకోవచ్చు. అయితే వీటితో చాట్ కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు హెల్దీ స్నాక్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు పిల్లలకు బాగా అందుతాయి. ఈ రెసిపీ పిల్లలకు బాగా నచ్చుతుంది. మరి మఖానా చాట్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫూల్ మఖానా చాట్‌కు కావాల్సిన పదార్థాలు:

ఫూల్ మఖానా, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, బంగాళ దుంపలు, జీలకర్ర పొడి, నిమ్మ రసం, కొత్తి మీర తరుగు, కారం, ఉప్పు, సేవ్, ఆయిల్ లేదా నెయ్యి, వేయించిన వేరుశనగ.

పూల్ మఖానా చాట్ తయారీ విధానం:

ముందుగా బంగాళ దుంపలను ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులో నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కాక.. మఖానా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. ఇవి వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని ఇందులో పచ్చి మిర్చి, కొత్తి మీర, ఉల్లిపాయలు, బంగాళ దుపంలు, టమాటాలు వేసి మెత్తగా పిసికి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇందులో వేయించుకున్న మఖానా కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సేవ్‌ను, కొత్తి మీరను పైన చల్లుకోవాలి. నెక్ట్స్ గుప్పెడు వేరు శనగ కూడా చల్లుకుంటే.. మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటుంది. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మఖానా చాట్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.