Cauliflower Rice: క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!

| Edited By: Ram Naramaneni

Oct 06, 2024 | 9:57 PM

క్యాలీ ఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం. క్యాలీ ఫ్లవర్‌తో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. క్రూసిఫర్ అనే జాతికి చెందిన కూరగాయల్లో క్యాలీ ఫ్లవర్ కూడా ఒకటి. క్యాలీ ఫ్లవర్‌తో చేసే వంటకాల్లో మసాలా రైస్ కూడా ఒకటి. దీంతో పక్కన రైతా పెట్టుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లోకి డిఫరెంట్‌గా కావాలి అనుకునేవారు ఈ రైస్‌ని లంచ్ బాక్స్‌లో పెట్టవచ్చు. ఈ రైస్ చేయడం కూడా చాలా ఈజీ. గోబీ రైస్ ఎంతో..

Cauliflower Rice: క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
Cauliflower Rice
Follow us on

క్యాలీ ఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం. క్యాలీ ఫ్లవర్‌తో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. క్రూసిఫర్ అనే జాతికి చెందిన కూరగాయల్లో క్యాలీ ఫ్లవర్ కూడా ఒకటి. క్యాలీ ఫ్లవర్‌తో చేసే వంటకాల్లో మసాలా రైస్ కూడా ఒకటి. దీంతో పక్కన రైతా పెట్టుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లోకి డిఫరెంట్‌గా కావాలి అనుకునేవారు ఈ రైస్‌ని లంచ్ బాక్స్‌లో పెట్టవచ్చు. ఈ రైస్ చేయడం కూడా చాలా ఈజీ. గోబీ రైస్ ఎంతో ఫేమస్. క్యాలీ ఫ్లవర్‌లో పురుగులు ఉంటాయని చాలా మంది తినరు. కానీ వేడి నీటితో శుభ్రంగా కడిగితే ఎలాంటి క్రిములు ఉండవు. పండుగలు, స్పెషల్ డేస్‌లో కూడా ఈ రైస్ చేసి పెట్టవచ్చు. ఇది తిన్నాక అందరూ మీకు ఫ్యాన్ అయిపోతారు.

క్యాలీ ఫ్లవర్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, క్యాలీ ఫ్లవర్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠాణీలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గరం మసాలా, బిర్యానీ దినుసులు కొద్దిగా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నెయ్యి, నూనె.

క్యాలీ ఫ్లవర్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా క్యాలీ ఫ్లవర్‌ని పురుగులు లేనివి చూసి తెచ్చుకోండి. ఆ తర్వాత దీన్ని కట్ చేసి వేడి నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. ఆ నెక్ట్స్ బియ్యం కడిగి అన్నం వండి పెట్టుకోండి. ఖాళీగా ఉండే కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు చాలా కొద్దిగా వేసుకోవాలి ఇవి వేగాక జీలకర్ర వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాక.. పుదీనా తరుగు, కరివేపాకు, పచ్చి బఠాణీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగాక.. ఇందులోనే క్యాలీ ఫ్లవర్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇవి ఓ ఐదు నిమిషాలు వేయించాక.. సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా కూడా వేసి బాగా కలపాలి. వీటిని ఓ రెండు నిమిషాలు చిన్న మంట మీద వేయిస్తే చాలు. ఆ తర్వాత ముందుగా వండి పెట్టుకున్న రైస్ కూడా వేసి అన్నీ కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి అన్నీ అంతా కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యాలీ ఫ్లవర్ మసాలా రైస్ సిద్ధం.