Banana Flower Curry: అరటి పువ్వు కర్రీ ఇలా చేశారంటే.. అద్భుతం అంతే!

|

Jan 28, 2025 | 7:19 PM

అరటి పువ్వు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అరటి పువ్వతో చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా కర్రీ తయారు చేస్తారు. అరటి పువ్వు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అరటి పువ్వు కర్రీని ఎంతో స్పెషల్‌గా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అరటి పువ్వు కర్రీని చాలా సింపుల్‌గా చేసేయవచ్చు..

Banana Flower Curry: అరటి పువ్వు కర్రీ ఇలా చేశారంటే.. అద్భుతం అంతే!
Banana Flower Curry
Follow us on

అరటి పువ్వు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అరటి పువ్వతో చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా కర్రీ తయారు చేస్తారు. అరటి పువ్వు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అరటి పువ్వు కర్రీని ఎంతో స్పెషల్‌గా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అరటి పువ్వు కర్రీని చాలా సింపుల్‌గా చేసేయవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు. మరి ఈ అరటి పువ్వు కర్రీని ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

అరటి పువ్వు కర్రీకి కావాల్సిన పదార్థాలు:

అరటి పువ్వు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, తాళింపు దినసులు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, వేరు శనగ, ఆయిల్, నెయ్యి.

అరటి పువ్వు కర్రీ తయారీ విధానం:

ముందుగా అరటి పువ్వును వేడి నీటితో శుభ్రంగా కడిగాలి. నీటిలో కొద్దిగా పెరుగు, పసుపు, ఉప్పు వేసి ఓ పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ అరటి పువ్వును చాలా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగితేనే రుచిగా ఉంటుంది. ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి వేడి చేయాలి. ముందుగా తాళింపు దినసులు, వేరు శనగ గుళ్లు, ఎండు మిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగాక కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టిన అరటి పువ్వును వేసి చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించాలి. అరటి పువ్వు బాగా వేగాక.. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే సింపుల్‌గా ఇలా అరటి పువ్వు కర్రీని తయారు చేయవచ్చు. ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.