Malai Puri: కేవలం 15 నిమిషాల్లోనే మలై పూరీని తయారు చేసుకోవచ్చు!

| Edited By: Ravi Kiran

Jan 09, 2024 | 7:30 PM

ఆంధ్ర ప్రదేశ్‌లో మలై పూరీ చాలా ఫేమస్. ఇది ఎంతో స్వీట్‌గా, రుచిగా ఉంటుంది. నోట్లే వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది మలై పూరీ. అయితే దీన్ని తయారు చేసుకోవడం మాత్రం కాస్త శ్రమతో కూడుకున్నది. అందుకే చాలా మంది స్వీట్ షాపుల్లో కొని తెచ్చుకుంటారు. ఇది చేయడం కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఈ మలై పూరీని కూడా అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ మలై పూరీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు..

Malai Puri: కేవలం 15 నిమిషాల్లోనే మలై పూరీని తయారు చేసుకోవచ్చు!
Malai Puri
Follow us on

ఆంధ్ర ప్రదేశ్‌లో మలై పూరీ చాలా ఫేమస్. ఇది ఎంతో స్వీట్‌గా, రుచిగా ఉంటుంది. నోట్లే వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది మలై పూరీ. అయితే దీన్ని తయారు చేసుకోవడం మాత్రం కాస్త శ్రమతో కూడుకున్నది. అందుకే చాలా మంది స్వీట్ షాపుల్లో కొని తెచ్చుకుంటారు. ఇది చేయడం కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఈ మలై పూరీని కూడా అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ మలై పూరీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మలై పూరీకి కావాల్సిన పదార్థాలు:

గులాబ్ జామూన్ మిక్స్, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు, ఆయిల్, నెయ్యి.

మలై పూరీ తయారు చేయు విధానం:

ముందుగా లోతు గిన్నెలో పంచదార, నీళ్లు, కుంకుమ పువ్వు వేసి వేడి చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఓ ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉడికించు కోవాలి. ఆ తర్వాత చల్లార నివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గులాబ్ జామూన్ మిక్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు తీసుకుని కలుపు కోవాలి. నెక్ట్స్ ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంతో పూరీలా ఒత్తుకుని ఆయిల్ వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తర్వాత వీటిని పంచదార పాకంలో వేసి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండు మలైపూరీ సిద్ధం. వీటిని ఏవైనా పండుగ స్పెషల్స్‌లో, వీకెండ్స్‌లో తయారు చేసుకుంటే స్పెషల్‌గా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు.