Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Semiya Upma: సేమ్యా ఉప్మా ముద్దవ్వకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి

రోజూ ఒకే రకం టిఫిన్ తినాలంటే బోర్ కొడుతోందా.. అయితే ఈ సారి డిఫరెంట్ గా ఈ సేమ్యా ఉప్మా ట్రై చేసి చూడండి. చాలామంది సేమ్యా ఉప్మా చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా ఆఖరికి ముద్దగా ఐపోతుంటుంది. అయితే దీనికి ఓ చిట్కా ఉంది. సేమ్యా రుచిగా ఉండటంతో పాటుగా పొడిపొడిగా కావాలనుకుంటే ఈ కొలతలతో ఓసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ ఇంటిల్లిపాదికీ నచ్చుతుంది. లైట్ గా కూడా ఉంటుంది.

Semiya Upma: సేమ్యా ఉప్మా ముద్దవ్వకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి
Semiya Upma Simple Recepie
Follow us
Bhavani

|

Updated on: Mar 24, 2025 | 1:37 PM

ఇంట్లో బ్రేక్​ఫాస్ట్ రెడీ​ చేయడానికి ఇడ్లీ, దోశ పిండి లేకపోతే.. చాలా మంది ఉప్మా చేసేస్తారు. ఈ ఉప్మా రెసిపీల్లో రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా కంటే.. ఎక్కువ మంది సేమియా ఉప్మాని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, అందరికీ సేమియా ఉప్మా పర్ఫెక్ట్​గా పొడిపొడిగా చేయడం రాదు. ఇంట్లో ఎప్పుడూ చేసినా నీళ్లు ఎక్కువైపోయి ముద్దగా మారిపోతుంటుంది. ఇలా కాకుండా సేమియా ఉప్మా పొడిపొడిగా రావాలంటే కొన్ని టిప్స్​ పాటిస్తూ చేయాలి. ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా సేమియా ఉప్మా చేస్తే పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. మరి, ఇంకెందుకు ఆలస్యం? నోరూరించే సూపర్​ టేస్టీ సేమియా ఉప్మా తయారీ విధానంపై ఓ లుక్కేయండి..!

కావాల్సిన పదార్థాలు :

సేమియా – గ్లాసు క్యారెట్​- ఒకటి (సన్నగా కట్​చేసుకోవాలి) పచ్చిబఠానీలు- అరకప్పు ఉల్లిపాయ-1 (సన్నగా కట్​చేసుకోవాలి) ఉప్పు – రుచికి సరిపడా కరివేపాకు-ఒకటి వేరుశనగలు- 2 టేబుల్​స్పూన్లు నూనె-టేబుల్​స్పూన్ అల్లం తురుము-టీస్పూన్​ జీడిపప్పు-పావు కప్పు పచ్చిమిర్చి-4 తాళింపు గింజలు- టేబుల్​స్పూన్​

సేమియా ఉప్మా తయారీ విధానం :

ముందుగా సేమ్యాను ఒక కడాయి పెట్టుకుని దోరగా వేయించుకోండి. సేమ్యా చేయడానికి ఇదెంతో కీలకం. గోల్డెన్ కలర్ లో వేయించుకుంటేనే దానికి అవసరమన రుచి, రంగు వస్తాయి. దీని వల్ల సేమ్యా మెత్తగా పొడి కాకుండా వస్తుంది.

ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి తాళింపు గింజలను వేయండి. తర్వాత వేరుశనగలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి దోరగా వేయించండి. అలాగే అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, క్యారెట్​, ముక్కలు, కొద్దిగా ఉప్పు వేయండి. తర్వాత బాగా కలిపి మూత పెట్టి వీటిని కొద్దిసేపు మగ్గించండి. తర్వాత ఇందులో ఏ గ్లాసుతో అయితే, సేమియా తీసుకుంటామో.. ఆ గ్లాసుతో ఒకటింపావు కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. సేమియా మెత్తగా ఉడకకుండా పొడిపొడిగా వస్తుంది.

నీరు మరుగుతున్నప్పుడు రుచి చూసుకుని ఉప్పును వేసుకోవాలి. నీరు తెర్ల కాగనిచ్చి అందులోనే వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా వేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి.

ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకుని సర్వ్​ చేసుకుంటే.. వేడివేడి సేమియా ఉప్మా రెడీ. ఇలా సేమియా ఉప్మా చేశారంటే.. మీ ఇంట్లో సేమియా ఉప్మా తినని వారు కూడా కచ్చితంగా ఈ రెసిపీకి ఫ్యాన్​ అయిపోతారు. నచ్చితే మీరు కూడా ఈ సింపుల్​ సేమియా ఉప్మాని ట్రై చేయండి.