Ivy gourd and Potato Curry: దొండకాయ, ఆలుగడ్డ కర్రీ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2024 | 8:36 PM

దొండకాయ అంటే పెద్దగా ఎవరికీ నచ్చదు. కేవలం పెళ్లిళ్లలో పెట్టే డీప్ ఫ్రై ఐటెమ్ మాత్రమే తింటారు. కానీ దొండకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దొండకాయ కూరను సరిగ్గా వండితే ఎంతో రుచిగా ఉంటుంది. దొండకాయతో పాటు ఆలు గడ్డ కలిపితే మరింత రుచిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి పులుసు పెట్టి కూర వండితే..

Ivy gourd and Potato Curry: దొండకాయ, ఆలుగడ్డ కర్రీ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
Ivy Gourd And Potato Curry
Follow us on

దొండకాయ అంటే పెద్దగా ఎవరికీ నచ్చదు. కేవలం పెళ్లిళ్లలో పెట్టే డీప్ ఫ్రై ఐటెమ్ మాత్రమే తింటారు. కానీ దొండకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దొండకాయ కూరను సరిగ్గా వండితే ఎంతో రుచిగా ఉంటుంది. దొండకాయతో పాటు ఆలు గడ్డ కలిపితే మరింత రుచిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి పులుసు పెట్టి కూర వండితే.. చేపలు పులుసును గుర్తు చేస్తుంది. అంత రుచిగా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి వండి పెట్టారంటే లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ గుత్తి దొండకాయ కర్రీ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలే ఏంటో ఇప్పుడు చూద్దాం.

గుత్తి దొండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

గుత్తి దొండకాయ, బంగాళ దుంపలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చింత పండు, కొబ్బరి తురుము, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, కొద్దిగా నెయ్యి.

గుత్తి దొడకాయ కర్రీ తయారీ విధానం:

ముందుగా దొండకాయలకు నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి. వీటిని ముందుగానే ఆయిల్‌లో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక.. ఉల్లి, పచ్చి మిర్చి మొక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త రంగు మారక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. ఆ నెక్ట్స్ బంగాళ దుంప ముక్కలు వేసి ఓ ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి. ఆ తర్వాత వేయించిన దొండకాయ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు కలిపి ఫ్రై చేయాలి.

ఇవి వేగాక కారం, పసుపు, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించి.. వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు చింత పండు గుజ్జు వేసి పులుసులా ఉడికించుకోవాలి. కొద్దిగా దగ్గర పడ్డాక.. గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి అంతా ఒకసారి కలపాలి. మళ్లీ ఒక ఉడుకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉంటే గుత్తి దొండకాయ, ఆలు గడ్డ కూర సిద్ధం. ఇది ఎందులోకి తిన్నా టేస్టీగానే ఉంటుంది.