AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sago Laddu: పండగలకు పర్ఫెక్ట్ స్వీట్.. 15 నిమిషాల్లో చేసే సాబుదానా లడ్డూ..

సాధారణంగా దీపావళి అంటే ఇంట్లో రకరకాల స్వీట్లు, లడ్డూలు తయారుచేస్తారు. అయితే, ఈసారి సాంప్రదాయ లడ్డూలకు భిన్నంగా, ఆరోగ్యకరమైన, తక్కువ తీపి లడ్డు ను ప్రయత్నించండి. దీనిని సాబుదాన లడ్డు లేక సాగు లడ్డు అని పిలుస్తారు. ఈ లడ్డు ఉపవాస దినాలకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఇది తక్కువ తీపితో, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది, అందుకే ఈ దీపావళికి ప్రతి ఒక్కరూ తప్పక ప్రయత్నించాల్సిన డెజర్ట్‌లలో ఇది ఒకటి. దీనిని సులభంగా తయారుచేసే విధానం, కావలసిన పదార్థాలు ఇక్కడ వివరంగా అందిస్తున్నాం.

Sago Laddu: పండగలకు పర్ఫెక్ట్ స్వీట్.. 15 నిమిషాల్లో చేసే సాబుదానా లడ్డూ..
Sabudana Laddu Recipe
Bhavani
|

Updated on: Oct 15, 2025 | 3:30 PM

Share

సాధారణ లడ్డూల తయారీ కష్టంగా భావించేవారికి, చక్కెర వినియోగం తగ్గించాలనుకునేవారికి సాబుదానా లడ్డు సరైన ప్రత్యామ్నాయం. జవరిసి లేక సాబుదాన పిండితో తయారుచేసే ఈ లడ్డు రుచితోపాటు ఆరోగ్యకరమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం కేవలం 15 నిమిషాల్లో మీ పండగను మరింత స్పెషల్ గా మార్చేయండి. ఈ లడ్డూ రెసిపీని ఇక్కడ చూడండి..

కావాల్సిన పదార్థాలు:

సాబుదాన – ½ కప్పు

యాలకులు – 1

జీడిపప్పు – 10

కొబ్బరి తురుము – ½ కప్పు

నెయ్యి – 250 మిల్లీలీటర్లు

చక్కెర – ¼ కప్పు

తయారీ విధానం:

1. సాబుదాన వేయించడం:

ముందుగా లడ్డూల కోసం మందపాటి సాబుదాన ఎంచుకోవాలి. దానిని శుభ్రం చేసి, ఒక పాన్‌లో వేయించుకోవాలి. ఈ సాబుదాన రంగు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించడం ముఖ్యం. ఇది పూర్తిగా వేగడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది.

2. పొడి తయారీ:

వేయించిన సాబుదానను పూర్తిగా చల్లార్చాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఇదే జార్‌లో యాలకులు, చక్కెర వేసి మరొక్కసారి మెత్తగా రుబ్బుకోవాలి.

3. కొబ్బరి, జీడిపప్పు వేయించడం:

ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేయాలి. తురిమిన కొబ్బరిని వేసి, దానిలోని తేమ పోయే వరకు వేయించుకోవాలి. వేరే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి, జీడిపప్పును బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

4. మిశ్రమం సిద్ధం:

సాబుదాన పొడిని, వేయించిన కొబ్బరి తురుమును ఒక గిన్నెలో కలపాలి. అందులో వేయించిన జీడిపప్పు ముక్కలు కూడా వేయాలి.

5. లడ్డు చుట్టడం:

ఈ పొడి మిశ్రమమంతా బాగా కలిసిన తర్వాత, కొద్దికొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి తగినంత కలిసిన తర్వాత, చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుంటే రుచికరమైన సాబుదాన లడ్డు సిద్ధం.

ఈ లడ్డు గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ ఉంచుకుంటే, ఒక వారం వరకు పాడవకుండా ఉంటుంది.

Follow Us