Chia Seeds for Health: చియా సీడ్స్‌ తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే..

|

Jun 21, 2024 | 8:51 PM

చియా విత్తనాలు ఫైబర్ కు మంచి మూలం. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ, పచ్చి చియా సీడ్స్‌ నేరుగా ఎప్పుడూ తినకూడదు. చియా గింజలను తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. బహుశా ఈ విత్తనాలు నీటిలో లేదా పాలలో నానబెట్టినప్పుడు జెల్‌గా తయారవుతాయి. అయితే చియా విత్తనాలతో పుడ్డింగ్ లేదా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

Chia Seeds for Health: చియా సీడ్స్‌ తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే..
Chia Seeds
Follow us on

చాలా మంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ నానబెట్టిన నీటిని తీసుకుంటారు. మరికొందరు వోట్స్ మీద చియా సీడ్స్‌ వేసుకుని తింటారు. కానీ చియా సీడ్స్‌ తినడానికి సరైన మార్గం చాలా మందికి తెలియదు. అలాగే, పచ్చి చియా సీడ్స్‌ను ఎప్పుడూ తినకూడదు. అది పాలు లేదా నీళ్లలో నానబెట్టుకుని తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న విత్తనాలు ఎన్నో ముఖ్యమైన పోషకాల భాండాగారం. వీటిలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ తినడం వల్ల ఫిట్‌గా ఉండగలరనడంలో సందేహం లేదు. అయితే, చియాసీడ్స్ నానబెట్టడానికి సరైన పద్దతి కూడా ఉందంటున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం…

చియా విత్తనాలు ఫైబర్ కు మంచి మూలం. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు, వివిధ రకాల అవసరమైన పోషకాలు ఉంటాయి. కానీ, పచ్చి చియా సీడ్స్‌ నేరుగా ఎప్పుడూ తినకూడదు. చియా గింజలను తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. బహుశా ఈ విత్తనాలు నీటిలో లేదా పాలలో నానబెట్టినప్పుడు జెల్‌గా తయారవుతాయి. అయితే చియా విత్తనాలతో పుడ్డింగ్ లేదా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

చియా సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. అయినప్పటికీ ఎక్కువ ఫైబర్ కొంతమందికి ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. చియా సీడ్స్‌ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు, వివిధ రకాల అవసరమైన పోషకాలు ఉంటాయి. చియా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు ఏర్పడే జెల్ అవసరమైన పోషకాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి నానబెట్టిన చియా సీడ్స్‌ తినడం వల్ల అందులోని పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. అంతేకాకుండా, చియా ఈ విధంగా తింటే త్వరగా జీర్ణమవుతుంది.

ఇవి కూడా చదవండి

చియా సీడ్స్‌ నానబెట్టేందుకు పాలు లేదా నీరు ఏదైనా సరే..ఉపయోగించేందుకు సరైన మార్గం ఉంది. చియా సీడ్స్‌ ఎల్లప్పుడూ 1:3 నిష్పత్తిలో నీటిలో లేదా పాలలో నానబెట్టండి. 1 భాగం చియా గింజలు, 3 భాగాలు నీరు లేదా పాలు తీసుకోండి. దీని కంటే ఎక్కువ చియా సీడ్స్‌ లేదంటే నీళ్లను తీసుకోవద్దు. చియా సీడ్స్‌ నీటిలో లేదా పాలలో కలిపిన తర్వాత, 15 నిమిషాలు అలాగే ఉంచండి. మధ్యలో, ఒక చెంచాతో మిశ్రమాన్ని కదిలించండి. మిశ్రమం చిక్కగా మారిన తర్వాత, మీరు దానిని తినవచ్చు. పాలలో చియా గింజలు కలిపితే అందులో మీకు నచ్చిన పండ్లు, నట్స్‌, ఇతర డ్రై ఫ్రూట్స్‌ వంటివి కలుపుకుని తింటే కూడా మంచి ఫలితాలు పొందుతారు.

చియా సీడ్స్‌ నీటిలో లేదా పాలలో మాత్రమే కాదు… చియా గింజలను పొడి పాన్‌లో వేయించుకోవచ్చు. ఇలా వేయించిన చియా గింజలను పెరుగు, వోట్‌మీల్ లేదా సలాడ్‌పై వేసుకుని కూడా తినవచ్చు. కావాలంటే ఈ చియా సీడ్‌ని స్మూతీస్‌లో కూడా కలుపుకోవచ్చు. వేయించిన చియా గింజలతో పుష్కలంగా నీరు తాగాలి.. లేకపోతే, జీర్ణ రుగ్మతలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చియా సీడ్స్ తినడానికి ట్రై చేయండి..దీంతో మీరు మరింత ప్రయోజనం పొందుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..