Prawn Egg Omelette: నాన్‌వెజ్ ప్రియులు రొటీన్ టిఫిన్స్‌తో విసిగిపోయారా.. అయితే వెరైటీగా రొయ్యల ఆమ్లెట్ ట్రై చేయండి

|

Aug 28, 2021 | 12:35 PM

Prawn Egg Omelette: నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్... చేపలు, పీతలు రొయ్యలు ఇలా ఎన్నిరకాల సీఫుడ్స్ ఉన్నా రొయ్యల స్థానం వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు. ఇవి మంచి పౌష్టికాహారం.. అంతేకాదు రొయ్యలు బరువు..

Prawn Egg Omelette: నాన్‌వెజ్ ప్రియులు రొటీన్ టిఫిన్స్‌తో విసిగిపోయారా.. అయితే వెరైటీగా రొయ్యల ఆమ్లెట్ ట్రై చేయండి
Prawn Egg Omelette
Follow us on

Prawn Egg Omelette: నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్… చేపలు, పీతలు రొయ్యలు ఇలా ఎన్నిరకాల సీఫుడ్స్ ఉన్నా రొయ్యల స్థానం వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు. ఇవి మంచి పౌష్టికాహారం.. అంతేకాదు రొయ్యలు బరువు తగ్గడానికి మంచి సహకారిగా ఉపయోగపడుతుంది. డైట్ చేసే వారు రొయ్యలను తమ ఆహారంలో చేర్చుకోమని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. అయితే ఈ రొయ్యలతో అనేక రకాల వంటలను తయారు చేయవచ్చు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు ఈ రొయ్యలతో ప్రత్యేక అనుబంధం ఉంది. రోజు ఏదొక కూరలో రొయ్యలను కలిసి కూరతయారు చేస్తారు. అంతేకాదు ఈ రొయ్యల స్పెషాలిటీ ఏమిటంటే.. రొయ్యలను విడిగా కూరగా వండుకోవచ్చు.. లేదా గుడ్లు, బీరకాయ, పాలకూర, తోటకూర, టమాటా ఇలా ఇతర వాటిల్లో కూడా కలిపి వండుకోవచ్చు. అయితే రొయ్యలతో ఆమ్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ తయారీ గురించి తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు:

రొయ్యలు – 20
బఠాణీ గింజలు – 100 గ్రాములు
గుడ్లు – 3
కారం
మిరియాల పొడి
సోయాసాస్‌ ఒక టీ స్పూన్
నువ్వుల నూనె
కొత్తిమీర తురుము
పుదీనా తురుము
ఉల్లికాడలు
ఉప్పు రుచికి తగినంత

తయారీ విధానం:

రొయ్యలను శుభ్రం చేసుకుని లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వాటిని ఉడికించుకోవాలి. పచ్చి బఠానీలను కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్‌ సోయాసాస్‌ వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. అనంతరం స్టౌ వెలిగించి బాణలి పెట్టుకుని వేడి ఎక్కిన తర్వాత కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న బఠాణీలు వేసుకుని కొంచెం సేపు వేయించాలి. తర్వాత ఉడికించుకున్న రొయ్యలను వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఈ రొయ్యల మిశ్రమాన్ని వేరే బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే బాణలిలో కొంచెం నూనె వేసుకుని ముందుగా కలిసి ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌ వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. కొంచెం సేపు వేగనిచ్చి.. మళ్ళీ దానిని తిరగవేసి వేయించుకోవాలి. అంతే రొయ్యలు ఆమ్లెట్‌ని జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకుని.. గార్నిష్‌ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్‌ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని వేసుకుంటే.. టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ రెడీ.. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.

Also Read: Chicken Shop: స్టీల్ బాక్స్ తెచ్చుకుంటే రూ.10 లు డిస్కౌంట్.. చికెన్ షాప్ యజమాని బంపర్ ఆఫర్