
అల్పాహారం తినడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. చాలా మంది అల్పాహారంగా ఉప్మా, ఇడ్లీ లేదా దోశను తింటారు. అయితే మీరు ప్రతిరోజూ ఇవన్నీ తిని తిని విసుగు చెందితే.. మీరు అల్పాహారంగా ఢోక్లా తినవచ్చు. మీరు దానిని బియ్యంతో చాలా మృదువుగా, రుచికరంగా, స్పాంజిగా వచ్చేలా చేసుకోవచ్చు.
బియ్యం పిండి- 1 కప్పు
పెరుగు- 1/2 కప్పు
అల్లం పచ్చిమిర్చి పేస్ట్- 1 టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- 1 చిటికెడు
బేకింగ్ సోడా- 1/2 టీస్పూన్
తయారీ విధానం: ఢోక్లా తయారు చేయడానికి.. ముందుగా తీసుకున్న అన్ని పదార్థాలను కలిపి పిండిని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. కొంత సమయం తర్వాత ఈ పిండిని ఢోక్లా అచ్చులో పోసి స్టీమర్‌లో 20 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆపివేసి చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు వీటికి పోపు వేసుకోండి. ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి.. కొంచెం నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి ఈ మసాలను ఢోక్లా మీద పోయాలి. పైన కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి అలంకరించండి. ఈ ఢోక్లాను కొత్తిమీర చట్నీ లేదా టమోటా చట్నీతో వడ్డించవచ్చు. ఈ విధంగా తయారుచేసిన ఢోక్లా చాలా మెత్తగా, స్పాంజిగా ఉంటుంది.
అల్పాహారంగా బియ్యం ఢోక్లా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. పెరుగు, బియ్యం దీనిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు కనుక ఢోక్లాని తినడం వలన శరీరానికి ప్రోటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఇది రోజంతా శరీరానికి శక్తిని అందిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..