బార్లీ గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. బార్లీ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ బార్లీ గింజలతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్లు, సగ్గుబియ్యం జావ తాగించేవాళ్లు. ఇప్పటికీ చాలా మంది ఇదే విధానం పాటిస్తుంటారు. అయితే, కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బార్లీ గింజల నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. తరువాత దానిలో గుప్పెడు బార్లీ గింజలను వేసి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా అవుతాయి. వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఇలా మరిగించిన నీరు చల్లారిన తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిలో నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యలు ఉన్న వారు బార్లీ నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
– పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
– బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి.
– బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగాలి.
– మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
– మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇకనైనా బార్లీ నీళ్లు ట్రై చేస్తారు కదూ!
– మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి.
– మధుమేహులకు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది.
– రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
– ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు.
ఒక గ్లాస్ బార్లీ నీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి