Oats Omelette with Egg: రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్‌తో బోర్ కొట్టిందా.. తక్షణ ఇచ్చే ఓట్స్ ఆమ్లెట్‌ని ట్రై చేసి చూడండి..

Oats Omelette with Egg: ఉదయం రోజూ టిఫిన్ తినడం తప్పనిసరి.. ఉదయం అల్పాహారం తీసుకోవడం స్కిప్ చేస్తే.. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన పెద్దలు కూడా..

Oats Omelette with Egg: రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్‌తో బోర్ కొట్టిందా.. తక్షణ ఇచ్చే ఓట్స్ ఆమ్లెట్‌ని ట్రై చేసి చూడండి..
Oats Omelette With Egg

Updated on: Aug 24, 2021 | 12:56 PM

Oats Omelette with Egg: ఉదయం రోజూ టిఫిన్ తినడం తప్పనిసరి.. ఉదయం అల్పాహారం తీసుకోవడం స్కిప్ చేస్తే.. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన పెద్దలు కూడా ఉదయం తీసుకునే ఆహారాన్ని రాజులా ఘనంగా తినాలని సూచించారు. అయితే పిల్లలే కాదు.. పెద్దలు కూడా రోజూ ఇదే టిఫిన్ తినాలా అంటూ బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేసి సరాసరి భోజనానికి వెళ్ళేవారున్నారు. అయితే రెగ్యులర్ టిఫిన్ తో బోర్ కొట్టేవారికోసం డిఫరెంట్ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్నాం. ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చే ఓట్స్ ఆమ్లెట్ తయారీ గురించి తెల్సుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు:

*కోడిగుడ్లు – (ఎగ్ వైట్స్ 4, ప‌చ్చ సొన 2)
*ఓట్స్ – 50 గ్రాములు
*ప‌చ్చిమిర్చి, (చిన్న ముక్కలు)
*ట‌మాటా (చిన్నముక్కలు)
*ఉల్లిపాయ‌లు (చిన్నముక్కలు)
*కొంచెం కారం
*పసుపు చిటికెడు
*రుచికి సరిపడా ఉప్పు
*నూనె తగినంత
*కాచి చల్లార్చిన పాలు లేదా అన్నం వార్చిన గంజి కొంచెం

తయారీ విధానం:

ఒక గిన్నె తీసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసి.. కొంచెం మెత్తగా కలపాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఓట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత గుడ్లలోని వెట్ వేసి.. ఎల్లో వేసి మిక్స్ చేసి.. కొంచెం పాలు వేసుకొని శుభ్రంగా మిక్స్ చేయాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత ఓట్స్, కోడిగుడ్డు కల్పిన మిక్స్ వేసి ఆమ్లెట్ వేయించుకోవాలి. మనం తీసుకున్న కొలతలుతో మూడు ఆమ్లెట్స్ అవుతాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తినవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ ఓట్స్ ఆమ్లెట్ శ‌రీరానికి ప్రోటీన్లు, పోష‌ణ ఇస్తుంది. శ‌క్తి అందుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాల జాబితా కింద‌కు ఓట్ మీల్ ఆమ్లెట్ వ‌స్తుంది. ఓట్స్‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌లు తలెత్తవు. ఓట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. ఇక కోడి గుడ్ల వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు, పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌యాన్నే సాధార‌ణ బ్రేక్ ఫాస్ట్ కు బ‌దులుగా ఓట్‌మీల్ ఆమ్లెట్‌ను తీసుకోవడం మంచిదని పోషకార నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  పిల్లలకు ఆవు పాలు మంచివా.. గేదెపాలు మంచివా. రెండు పాలల్లో తేడాలు ఏమిటి.. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే