Health Tips: తీపి పదార్థాలు భోజనం తరువాత తినాలా? భోజనానికి ముందే తినాలా?.. ఆయుర్వేదం చెబుతున్న కీలక సూచనలు మీకోసం..

|

May 06, 2022 | 7:30 AM

Health Tips: చాలా మంది భోజనం చేసిన తరువాత చివర్లో ఎంతో కొంత స్వీట్ తింటారు. లేదంటే.. భోజనం చేసిన ఫీల్ లేదని భావిస్తుంటారు.

Health Tips: తీపి పదార్థాలు భోజనం తరువాత తినాలా? భోజనానికి ముందే తినాలా?.. ఆయుర్వేదం చెబుతున్న కీలక సూచనలు మీకోసం..
Sweets
Follow us on

Health Tips: చాలా మంది భోజనం చేసిన తరువాత చివర్లో ఎంతో కొంత స్వీట్ తింటారు. లేదంటే.. భోజనం చేసిన ఫీల్ లేదని భావిస్తుంటారు. అయితే, భోజనం చేసిన తరువాత స్వీట్స్ తినడం చాలా ప్రమాదకరమని ఎంత మందికి తెలుసు?.. భోజనం తరువాత కంటే భోజనం చేసే ముందే స్వీట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనం కలుగుతుందని ఎంత మందికి తెలుసు? దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఈ ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఆయుర్వేదన నిపుణుడు డాక్టర్ నితికా కోహ్లీ తెలిపిన సమాచారం ప్రకారం.. తీపి పిదార్థాలు తినే సమయం.. ఓజస్(మెరుగైన జీర్ణ వ్యవస్థ), ఆమ్లత్వాన్ని(అసడిటీ, విషతత్వం) రెండింటినీ ప్రభావితం చేస్తుంది. పెంచుతుంది. అందుకే తినే ఆహారంపై అవగాహన ముఖ్యం అని చెబుతున్నారు నితికా కోహ్లీ.

భోజనానికి ముందు స్వీట్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు, తరువాత తినడం వలన కలిగే దుష్ఫలితాలు..

ఇవి కూడా చదవండి

1. తీపి పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
2. తీపి పదార్థాన్ని ముందుగా తినడం వల్ల జీర్ణ స్రావాల ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది.
3. భోజనం తర్వాత స్వీట్లు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మందగిస్తుంది.
4. భోజనం ప్రారంభంలో స్వీట్లు తింటే జీర్ణక్రియను సక్రియం చేస్తుంది.
5. భోజనం చివరిలో స్వీట్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. అసిడిటీ సమస్య తలెత్తుతుంది. అజీర్తి సమస్యలు వస్తాయి.
6. భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది.