Health Tips: నాన్-వెజ్ ప్రియులలో చికెన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్టర్స్, అపెటైజర్స్ నుంచి మెయిన్ కోర్స్ వరకు, చికెన్‌తో ఎన్నో వెరైటీ వంటకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చికెన్ సాధారణంగా ఆరోగ్యకరమైన పౌల్ట్రీ ఐటెమ్‌గా పేరుగాంచింది. ఇది ప్రోటీన్‌తో కూడిన శక్తిని అందిస్తోంది. అలాగే శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. అయితే అదేపనిగా ప్రతిరోజూ చికెన్ తీసుకుంటే మాత్రం కొన్ని పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏ ఫుడ్‌నైనా మితంగా తీసుకుంటేనే మంచింది. చికెన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్..
సరైన పద్ధతిలో చికెన్ తీసుకోకపోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది మీరు చికెన్‌ను ఎలా తీసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. డీప్‌ఫ్రైడ్ చికెన్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే, మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనం మేరకు వైట్ మీట్ చికెన్ రెడ్ మీట్ చేసే విధంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని తేల్చింది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, కాల్చిన, ఉడకబెట్టిన, కాల్చిన లేదా వేయించిన చికెన్ తినడం ఉత్తమం అని తెలుసుకోండి.
అధిక వేడి..
చికెన్ అధిక వేడిని కలిగించే ఆహారంగా పేరుగాంచింది. ఇది మీ శరీరం మొత్తం ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని కారణంగా, కొంతమందికి ముఖ్యంగా వేసవిలో ముక్కు కారటంలాంటివి ఉండవచ్చు. రోజూ చికెన్ తీసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. క్రమం తప్పకుండా చికెన్ తిన్న తర్వాత ముక్కులో రక్తం కారినట్లు అనిపిస్తే, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తీసుకోవడం మంచిది.
బరువుపై తీవ్ర ప్రభావం..
క్రమం తప్పకుండా చికెన్ తినడం వల్ల వచ్చే మరో సైడ్ ఎఫెక్ట్ బరువు పెరగడం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్ మరెన్నో ఆహార పదార్థాలు అధిక కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారు. వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం మంచింది. రెగ్యులర్ తింటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని కూడా విపరీతంగా పెంచుతుంది.
యూరినరీ ఇన్‌ఫెక్షన్స్..
కొన్ని రకాల చికెన్‌లు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లు లేదా UTIకి కూడా సంబంధం కలిగి ఉంటాయి. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్ mBio స్టడీ ప్రకారం, E.coli నిర్దిష్ట జాతితో కూడిన చికెన్ UTIతో సహా అనేక రకాల ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతుందని తేల్చింది. ఇలాంటి ఇన్ఫెక్షన్లను నివారించాలంటే మాత్రం యాంటీబయాటిక్స్ వాడకుండా ఉన్న చికెన్ తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Coconut Benefits: రాత్రి నిద్రపోయే ముందు పచ్చి కొబ్బరి తింటే ఎన్నో ప్రయోజనాలు.. మీరు తెలుసుకోండి..
Omicron Variant: మీ కళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం..!