Life Style Tips: కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా కొన్నిసార్లు అనారోగ్యానికి దారితీస్తాయి. ముఖ్యంగా ఇతర పదార్థాలతో వాటిని కలిపి తీసుకున్నప్పుడు. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బ తీస్తాయి. అలాగే ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్రమైన ఉదర సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. ఈనేపథ్యంలో కొన్ని ఫుడ్ కాంబినేషన్లకు దూరంగా ఉండాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేదం ఆరోగ్యకరమైన జీవన విధానాంతో పాటు పోషకాహారాన్ని ప్రోత్సహిస్త్ఉంది. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను తొలగించుకోవచ్చు. అదే సమయంలో కొన్ని వ్యాధులు, అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని ఫుడ్ కాంబినేషన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయుర్వేదం సూచిస్తోంది. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
అరటిపండు- పాలు
అరటిపండు, పాలు రెండూ విడివిడిగా తీసుకుంటే జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యానికి, అలాగే జీవక్రియకు ఎంతో మంచిది. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, అలర్జీలను కలిగించే హానికరమైన టాక్సిన్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అరటిపండు పుల్లగానూ, పాలు తీపిగానూ ఉంటే వాటిని తిన్న తర్వాత జీర్ణవ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది.
నెయ్యి- పెరుగు
ఈ రెండూ పాల ఉత్పత్తులే. విడివిడిగా తీసుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయి. అయితే రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం అజీర్తి సమస్యలు తలెత్తాయి. అలాగే గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి.
యాపిల్‌తో పుచ్చకాయ
మీరు పండ్లు తినాలని ఆలోచిస్తున్నట్లయితే, పుచ్చకాయను ఇతర పండ్లతో కలిపి తీసుకోకూడదు. పుచ్చకాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల యాపిల్ వంటి పండ్లతో కలిపి తింటే అవి సరిగా జీర్ణం కావు అంటున్నారు వైద్యులు.
పండ్లు- కాయగూరలు
ఆయుర్వేదం ప్రకారం పండ్లను కూరగాయలతో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే పండ్లలోని అధిక చక్కెర కంటెంట్ కూరగాయల జీర్ణక్రియ ప్రక్రియను దెబ్బతీస్తుంది.
బంగాళాదుంపలు- గుడ్లు
గుడ్లు ప్రోటీన్లతో నిండి ఉంటాయి. అలాగే బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ శోషణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
ఇవి కూడా..
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..