వేసవిలో ఉల్లిపాయ(Onion)ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. హీట్ స్ట్రోక్‌ను నివారించడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బ్యూటీ కేర్ రొటీన్‌లోనూ ఉల్లిపాయలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది జుట్టు సంరక్షణలో ఉల్లిపాయను ఉత్తమంగా భావిస్తారు. ఇందుకోసం ఉల్లిపాయ రసం లేదా నూనెతో జుట్టును కాపాడుకుంటుంటారు. ఉల్లిపాయ అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది కూరగాయల రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే ఇది వంటగదిలో ముఖ్యమైన పదార్థంగా గుర్తించారు. ఆహార ప్రియులు ఉల్లిపాయల పేస్టును కలపడం లేదా ముక్కలు చేసి ఉపయోగిస్తుంటారు. ఇది మరోరకంగాను ఆరోగ్యానికి మరింత ఆరోగ్యకరమైనదిగా మారుతుంది. మొలకెత్తిన ఉల్లిపాయల(Sprouts Onion)ను ఉపయోగించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.
పెద్దమొత్తంలో ఉల్లిపాయలను కొని వంటగదిలో చాలా రోజులు ఉంచిన తర్వాత మొలకలు వస్తాయి. అయితే, ఎక్కువ మంది ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. అయితే వీటిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందని చాలామందికి తెలియదు. ఈ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొలకెత్తిన ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు మొలకెత్తిన ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, అది శరీరంలోని విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా మార్చుతుంది.
2. ఈ ఉల్లిపాయలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉన్నందున, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్ శరీరంలో సరైన మోతాదులో తీసుకుంటే, కడుపు సంబంధిత సమస్యలు మనకు దూరంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో, మొలకెత్తిన ఉల్లిపాయలను పచ్చిగా తినడం ద్వారా, మీరు ఫైబర్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.
3. మొలకెత్తిన ఉల్లిపాయల్లో క్యాల్షియం, ఫాస్పరస్ గుణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మీరు దీన్ని రోజూ పరిమిత పరిమాణంలో తీసుకుంటే, దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
4. వేసవి కాలంలో, ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలతో సహా వేడిని నివారించడానికి అనేక పదార్థాలను తీసుకుంటారు. దీన్ని సలాడ్ రూపంలో తింటే పొట్ట చల్లగా ఉంటుందని, జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
Also Read: World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..
Women Health: మెనోపాజ్ వల్ల 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువవుతున్న గుండె జబ్బులు.. ఇలా చేశారంటే..