Tomato for health: ఖాళీ కడుపుతో టొమాటో జ్యూస్‌.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

Health Tips: వంటకాలకు ఎంతో రుచిని అందించే టొమాటో (Tomatoes) లో పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. విటమిన్లు- సి, ఎ, క్యాల్షియం, పొటాషియం తదితర పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.

Tomato for health: ఖాళీ కడుపుతో టొమాటో జ్యూస్‌.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
Tomato Juice

Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2022 | 8:51 AM

Health Tips: వంటకాలకు ఎంతో రుచిని అందించే టొమాటో (Tomatoes) లో పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. విటమిన్లు- సి, ఎ, క్యాల్షియం, పొటాషియం తదితర పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే చాలామంది చట్నీ, కూరగాయల, సూప్ లేదా జ్యూస్.. ఇలా రకరకాలుగా టొమాటోలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. మరికొంతమంది సలాడ్ల రూపంలో కూడా తీసుకుంటుంటారు. కాగా పోషకాలు విరివిగా ఉన్న టొమాటోలను ఖాళీ కడుపుతో తీసుకంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందా రండి.

రోగనిరోధక శక్తి..

కరోనా యుగంలో రోగనిరోధక శక్తి ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది ఇమ్యూనిటీని పెంపొందించుకోవడానికి తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. ఈక్రమంలో టొమాటోలో కూడా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. టొమాటోలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి విటమిన్‌-సి పుష్కలంగా అందుతుంది. కాబట్టి ఉదయాన్నే టొమాటో రసం తాగడం ద్వారా రోజు ప్రారంభించినట్లైతే ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చంటున్నారు నిపుణులు.

బరువు తగ్గడం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టొమాటో రసం తాగితే మేలంటున్నారు. ఇలా చేయడం వల్ల అదనపు బరువు తగ్గడమే కాకుండా ఊబకాయం లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. టొమాటోలను దాని తొక్కతో సహా కూడా తినవచ్చు. ఇలా తినడం వల్ల ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్, భాస్వరం తదితర పోషకాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ శరీరానికి ఎంతో అవసరం.

కడుపులో మంట..

కడుపులో మంటగా అనిపిస్తే ఏమీ తినాలనిపించదు. ఇలాంటి సమస్యలున్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టొమోటా రసం తాగితే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా ఉదయాన్నే టొమాటో జ్యూస్‌ తీసుకోవడం ఆరోజంతా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు.

కంటిచూపు..

కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకోసం టొమాటోలను ఎంచుకోవడం ఉత్తమం. ఖాళీ కడుపుతో టొమాటో జ్యూస్ తాగడం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. టొమాటో జ్యూస్ తాగడం వల్ల కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్ల ఉనికిని గణనీయంగా పెంచుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు కూడా దరికి రావు.

Also Read:IND vs SL: ధర్మశాల చరిత్ర మార్చిన రోహిత్ సేన.. లంకపై 7 వికెట్ల తేడాతో విజయం.. రాణించిన శ్రేయాస్, జడేజా, శాంసన్

Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..