Mint-Coriander Leaves Juice: ఎలాంటి రోగాలైనా నయం కావాలంటే.. ఈ జ్యూస్ ఒక్కటి తాగండి అన్నీ సెట్ అయిపోతాయి!!

మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా తొందరగా వ్యాధులకు గురవుతున్నారు. తీసుకునే ఆహారంలో తగిన విధంగా పోషకాలు లేకపోవడంతో, తీపి పదార్థాలు ఎక్కువగా ఉండటంతో ఇమ్యూనిటీ లోపిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మనం తీసుకునే ఫుడ్ పైనే హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆహారంలో శరీరానికి అవసరయ్యే విటమిన్స్, మినరల్స్, పోషకాలు, ఫైబర్ వంటికి లేకపోతే.. గ్యాస్, అజీర్తి, మల బద్ధకం, బీపీ, షుగర్, గుండె సమస్యలు, అధిక బరువు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో ఆస్పత్రుకలు క్యూ కడుతున్నారు. అదే ముందు నుంచి తగిన జాగ్రత్తలు..

Mint-Coriander Leaves Juice: ఎలాంటి రోగాలైనా నయం కావాలంటే.. ఈ జ్యూస్ ఒక్కటి తాగండి అన్నీ సెట్ అయిపోతాయి!!
Mint Coriander Leaves Juice

Edited By: Ram Naramaneni

Updated on: Sep 25, 2023 | 10:07 PM

మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా తొందరగా వ్యాధులకు గురవుతున్నారు. తీసుకునే ఆహారంలో తగిన విధంగా పోషకాలు లేకపోవడంతో, తీపి పదార్థాలు ఎక్కువగా ఉండటంతో ఇమ్యూనిటీ లోపిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మనం తీసుకునే ఫుడ్ పైనే హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆహారంలో శరీరానికి అవసరయ్యే విటమిన్స్, మినరల్స్, పోషకాలు, ఫైబర్ వంటికి లేకపోతే.. గ్యాస్, అజీర్తి, మల బద్ధకం, బీపీ, షుగర్, గుండె సమస్యలు, అధిక బరువు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో ఆస్పత్రుకలు క్యూ కడుతున్నారు. అదే ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. రోగాలకు దూరంగా ఉండొచ్చు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవ్వొచ్చు. ఇంట్లో సులభంగా లభ్యమయ్యే పదార్థాలన పదార్థాలతోనే హెల్దీ జ్యూస్ తయారు చేసుకోండి. పుదీనా, కొత్తిమీరతో తయారు చేసుకునే జ్యూస్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ జ్యూస్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు:

కొత్తి మీర, పుదీనా, తులసి ఆకులు.

ఇవి కూడా చదవండి

ఈ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలంటే:

గుప్పెడు కొత్తిమీర, గుప్పుడె పుదీనా, కొద్దిగా తులసి ఆకులను బాగా శుభ్రంగా కడిగి, ఓ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. వీటిలో తగిన మోతాదులో నీళ్లను పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ ని వడకట్టి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. అంతే పుదీనా – కొత్తిమీర జ్యూస్ సిద్ధం.

పుదీనా-కొత్తిమీర జ్యూస్ ప్రయోజనాలు:

– శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
– సీజనల్ వ్యాధులకు రాకుండా ఉంటాయి
– బరువు తగ్గొచ్చు.
– డయాబెటీస్ కంట్రోల్ లోకి వస్తుంది.
– రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
– జీర్ణ సమస్యలు ఉండవు.
– కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో నొప్పి, మల బద్ధకం సమస్యలు తగ్గుతాయి.
– తొందరగా ఆకలి వేయనివ్వదు.
– యాక్టీవ్ గా ఉంటారు.
– శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు పోతాయి.
– జుట్టు సమస్యలు తగ్గుతాయి.
– చర్మం కాంతి వంతంగా తాయరవుతుంది.

అయితే కొంత మందికి ఈ జ్యూస్ పడకవచ్చు. వాంతులు కూడా అవ్వొచ్చు. అలాంటి వారు ఈ జ్యూస్ కి దూరంగా ఉండవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.