Raw Papaya Benefits: పచ్చి బొప్పాయిలో ఉన్న హెల్త్‌ సీక్రెట్స్ తెలిస్తే.. వామ్మో అనాల్సిందే..!

|

Jul 20, 2024 | 8:31 PM

పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల పచ్చి బొప్పాయి తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.

Raw Papaya Benefits: పచ్చి బొప్పాయిలో ఉన్న హెల్త్‌ సీక్రెట్స్ తెలిస్తే.. వామ్మో అనాల్సిందే..!
Raw Papaya
Follow us on

పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ పోషకాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌,యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పచ్చి బొప్పాయి తింటే.. జీర్ణ ప్రక్రియను ప్రోత్సాహించడంతో పాటు కీళ్ల సమస్యలకు కూడా చెక్‌ పెడుతుంది.

బొప్పాయిలో మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయి. పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువును నియంత్రిస్తుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి అంటు వ్యాధులు, అనారోగ్యాలతో పోరాడటంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొప్పాయి అద్భతంగా పనిచేస్తుంది.

బరువు తగ్గలనుకునే వాళ్లకి ఈ పచ్చి బొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది. పేగులలో, కడుపులో ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి ఈ పచ్చి బొప్పాయి దివ్య ఔషాధంలా పని చేస్తుంది. పచ్చి బొప్పాయి తినడం వలన చర్మం పై ఉన్న సోరియాసిస్, మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్, వంటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. తాజా ఆకుపచ్చ బొప్పాయి రసం తీసుకోవడం వలన ఎర్రబడిన టాన్సిల్స్‌కు చికిత్సగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వలన ఆస్తమా, ఆస్టియా ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల పచ్చి బొప్పాయి ముక్కలను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది. డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

బొప్పాయిలోని విటమిన్ సి, ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. పచ్చి బొప్పాయిలో ఉండే ఫైబర్ , పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయిలో సపోనిన్, బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పచ్చి బొప్పాయి శరీరం నుంచి వ్యర్ధాలను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..