Hair Care Tips: పొడవైన, అందమైన జుట్టు కోసం వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి..

|

Mar 03, 2022 | 9:45 AM

Hair Care Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, దృఢంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. దీని కోసం, చాలా మంది అనేక రకాల రసాయనాలు..

Hair Care Tips: పొడవైన, అందమైన జుట్టు కోసం వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి..
Hair
Follow us on

Hair Care Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, దృఢంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. దీని కోసం, చాలా మంది అనేక రకాల రసాయనాలు కలిగిన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. అయితే, ఇవి దీర్ఘకాలంలో జుట్టును డ్యామేజ్ చేస్తాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇంట్లో తయారుచేసిన ఇంటి నివారణలను కూడా ప్రయత్నిస్తారు. ఇందులో ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్, కండీషనర్ మొదలైనవి ఉంటాయి. అయితే జుట్టు బలంగా, మెరిసేలా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం. జుట్టు కుదుళ్లలో కెరాటిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. జుట్టు పొడవుగా, దృఢంగా ఉండాలంటే.. ఖనిజాలు, విటమిన్లు అందించాలి. ఈ నేపథ్యంలో జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్లు..
గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. జుట్టుకు ఇది మరో ముఖ్యమైన పోషకం. బలమైన జుట్టు కోసం ఆహారంలో గుడ్లు చేర్చవచ్చు.

ఆకు కూరలు..
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టుకు అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. మీ జుట్టు కణాలకు పటిష్టం చేసేందుకు దోహదపడుతుంది. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. మీ శరీరంలో ఐరన్ లోపిస్తే.. ఆక్సిజన్, పోషకాలు జుట్టు మూలాలు, ఫోలికల్స్‌కు తగినంతగా చేరవు. ఇది జుట్టు పెరుగుదలను ఆపివేస్తుంది.

సి విటమిన్ కలిగిన పండ్లు..
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ శోషణకు మీ శరీరానికి విటమిన్ సి అవసరం. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజూ నిమ్మకాయ రసాన్ని తాగితే ప్రయోజనం ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అవసరం.

పప్పులు, తృణ ధాన్యాలు..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు పోషణనిస్తాయి. ఇది జుట్టు ఒత్తుగా మారడంలో సహాయపడుతుంది. ఇందుకోసం డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ను డైట్‌లో చేర్చుకోవచ్చు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్‌ని కూడా తీసుకోవచ్చు.

Also read:

Anand Mahindra: ట్విట్టర్ వీడియోపై స్పందించిన మహీంద్రా.. వాట్ ఏ ఐడియా సర్జీ అంటూ కితాబు..

Russia-Ukraine crisis: పుతిన్‌ నిర్ణయం సరైనదే.. ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించిన భారత సంతతి లెజిస్లేచర్..

Pooja Hegde : క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రాకారును కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ… లేటెస్ట్ (ఫొటోస్)