
రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి చాలా నేచురల్ రెమిడీస్ కూడా ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారంతో పాటు జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందట. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే టిప్స్ పై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్న వారు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించగల ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతాయి.
ఫైబర్ శరీరానికి చాలా ఉపయోగకరమైనది. ఇది రక్తంలో చక్కెర ప్రవాహాన్ని తగ్గించి, గ్లూకోజ్ శరీరానికి తక్కువగా అందేలా చేస్తుంది. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు వంటి వాటిని ఆహారంలో చేర్చడం మంచిది.
భోజనం తరువాత 15-30 నిమిషాలపాటు నడక చేయడం చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా శరీరానికి యాక్టివ్‌గా ఉండే శక్తిని ఇస్తుంది. నడక దినచర్యలో భాగం చేసుకుంటే డయాబెటిస్ తగ్గడం సులభం.
ఒకే సారి ఎక్కువగా తినడం కంటే, చిన్నపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒకే సారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. మితంగా తినడం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది.
గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. స్వీట్స్, షుగర్, సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. తక్కువ గ్లైసిమిక్ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గంటల కొద్దీ కూర్చుని ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటమే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. పని చేయడం మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం శరీరానికి మంచిది.
నిద్రలేమి రక్త చక్కెర స్థాయిల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. ఇది శరీరానికి తగినంత విశ్రాంతిని ఇస్తుంది.
వాటర్ తాగడం వల్ల రక్తంలోని చక్కెరను తొలగించి డయాబెటిస్ అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)