Healthy Lungs: మీ ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినివ్వండి.. చలికాలంలో ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే..

| Edited By: Anil kumar poka

Jan 11, 2023 | 5:16 PM

మన ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్ అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటి ద్వారానే మిగిలిన శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Healthy Lungs: మీ ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినివ్వండి.. చలికాలంలో ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే..
Lungs
Follow us on

చలి కాలం ఎంత ఆహ్లాదాన్ని పంచుతుందో.. అంతే ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా ఫ్లూ వైరస్ ల కారణంగా జలుబు, దగ్గు వంటి వి వేధిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంటాయి. దీనికి కారణం ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ వంటివి చేరడం వల్ల అవి సక్రమంగా పనిచేయలేకపోవడమే. కరోనా వంటి వైరస్ లు కూడా ఊపిరితిత్తులపై దాడి చేసి, శ్వాస ఆడకుండా చేసి మనిషి ప్రాణాలను హరించాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా ప్రధానం. వాటిని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో లాంగ్ లివ్ లంగ్స్ కోసం చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై నిపుణులు చెబుతున్న అంశాలు మీకోసం..

వ్యాయామం.. ఆహారం..

మన ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్ అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటి ద్వారానే మిగిలిన శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే రోజూ వ్యాయామం చేయాలని చెబుతున్నారు. దీంతో పాటు మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని వివరిస్తున్నారు.

ఇవి రోజూ తింటే..

ఊపిరితిత్తులకు కొత్త ఊపిరి పోసే మంచి ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో వీటిని రోజూ తినడం ద్వారా మన లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం..

ఇవి కూడా చదవండి

మిరియాలు.. వీటిల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

పసుపు.. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పసుపులో ఉండే ప్రధాన కర్కుమిన్ మెరుగైన ఊపిరితిత్తుల పనితీరుకు ఉపకరిస్తుంది.

అల్లం.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంలో అల్లం సమర్ధవంతంగా పనిచేస్తుంది. హైపెరాక్సియా, ఇన్ఫ్లమేషన్ వంటి వాటి నుంచి ఊపిరితిత్తులను సంరక్షిస్తుంది.

బార్లీ.. ఇది ఫైబర్ అధికంగా ఉండే పోషకమైన తృణధాన్యం. ఏ తృణధాన్యం అయినా వాటిలో ఉండే అధిక ఫైబర్ ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తాయి.

ఆకు కూరలు.. బాక్ చోయ్, బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరల్లో కెరోటినాయిడ్లు, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ల అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగ నిరోధకశక్తని పెంపొందిస్తాయి. ఇవి ఊపరితిత్తులు ఇన్ ఫ్లమేషన్ బారిన పడకుండా కాపాడతాయి.

వాల్‌నట్స్.. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల వాపును తగ్గించి, మీ శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి.. దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మీ ఊపితిత్తుల సమస్యలను తగ్గించి.. వాటి పనితీరుని మెరుగుపరుస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..