Flaxseed Ladoo: పాతతరం సాంప్రదాయ స్వీట్ నువ్వుల లడ్డు.. రోజు ఒకటి తిన్నా అద్భుతప్రయోజనాలు.. రెసిపీ మీకోసం

|

Dec 11, 2021 | 7:58 PM

Flaxseed Ladoo Recipe: రోజు రోజుకీ మారుతున్న మనిషి జీవన విధానంతో ఆహారపు అలవాట్లో కూడా మార్పులు వచ్చాయి.  పూర్వం మన పెద్దవారు అన్ని రకాల..

Flaxseed Ladoo: పాతతరం సాంప్రదాయ స్వీట్ నువ్వుల లడ్డు.. రోజు ఒకటి తిన్నా అద్భుతప్రయోజనాలు.. రెసిపీ మీకోసం
Flaxseed Ladoos
Follow us on

Flaxseed Ladoo Recipe: రోజు రోజుకీ మారుతున్న మనిషి జీవన విధానంతో ఆహారపు అలవాట్లో కూడా మార్పులు వచ్చాయి.  పూర్వం మన పెద్దవారు అన్ని రకాల ఆహారాలను ఇష్టంగా తినేవారు.. అందుకనే ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఇప్పటి జనరేషన్ ఏదైనా తినాలంటే.. ముందుగా కంటికి ఇంపుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో చేసిన వంటలు, స్వీట్స్ కంటే రెస్టారెంట్స్, సీట్స్ షాప్స్ లో దొరికే ఫుడ్ నే ఇష్టపడుతున్నారు. అయితే నాటి సాంప్రదాయ వంటల్లో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. కాలనికి అనుగుణంగా దొరికేవాటితో తయారు చేసే ఆహారపదార్ధాలు, సీట్స్ ఏమైనా సరే.. ఆరోగ్యానికి మేలు చేసేవే.. ఈరోజు ఐరెన్ సంవృద్ధిగా లభించే నువ్వుల లడ్డూ తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

తెల్ల నువ్వులు -ఒక కప్పు

బాదాం పలుకులు – కొన్ని (చిన్న చిన్న ముక్కలు)

బెల్లం -తీపికి సరిపడా

నెయ్యి -రెండు స్పూన్లు

తయారీ విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి… నువ్వులను స్విమ్ లో పెట్టి వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో తురిమిన బెల్లాన్ని వేసుకుని నీరు పోసి.. తీగ పాకం వచ్చే వరకూ బెల్లాన్ని మరిగించి.. దానిలో నువ్వుల పొడి.. బాదాం పలుకులు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసి.. ఉండలు వచ్చేలా అయ్యాక స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి చేతికి అద్దుకుని లడ్డులు చుట్టుకోవాలి. ఈ నువ్వుల లడ్డులు  పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి.

ఈ నువ్వుల లడ్డు రోజు ఒకటి తింటే.. రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు. శరీరానికి శక్తి అందుకుంటుంది.. త్వరగా అలసి పోకుండా ఉంటారు.

Also Read: బరితెగించిన విద్యార్థులు.. పాఠాలు చెప్పేందుకు వచ్చిన టీచర్‌ని టీజ్ చేస్తూ.. నెత్తిమీద చెత్త బుట్ట..