శారీరక దృఢత్వం కోసం కొందరు జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేస్తుంటారు. మరి కొందరు డైట్ ఫాలో అవుతుంటారు. ఇక డైట్‌లో భాగంగా అనేక రకాల డ్రైనట్స్, డ్రైఫ్రూట్స్‌ని ఆహారంగా తీసుకుంటారు. అయితే వాటిలో కొన్నింటిని చాలా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయెజనాలు. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఆహారాలలో అవిశె గింజలు కూడా ఒకటి. వీటితో సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అవిశె గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, లిగ్నన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పలు పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. అయితే అవిశె గింజలను పరిమితంగా తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలు చేకూరతాయి. అలా కాకుండా పరిమితి దాటి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు తప్పవు. మరి ఈ గింజలతో కలిగే దుష్ప్రభావాలేమిటో ఇప్పుడు చూద్దాం..
డయేరియా: అవిశె గింజలను అతిగా తీసుకుంటే డయేరియా ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల వీటిని పరిమితంగా, తగినంతగానే తీసుకోవాలి.
మలబద్ధకం: అవిశె గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల్ మలబద్దకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది.
ఎలర్జీ సమస్యలు: చాలా మంది అవిశె గింజలను ఎక్కువగా తింటే ఫిట్‌గా ఉండవచ్చనుకుని ఎక్కువగా తీసుకుంటారు. అయితే అది నిజం కాకపోగా ఎలర్జీ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాక దురద, తామర వంటి సమస్యలను కలిగిస్తుంది.
బ్లడ్ షుగర్: డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు అవిశె గింజలను తీసుకోకూడదు. ఎందుకంటే అవిశె గింజలు మీరు తీసుకునే మందుల ప్రభావాన్ని క్షీణింపచేయగలవు. తద్వారా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..