Andhra Style Fish Curry: ఆంధ్ర స్టైల్‌లో ఈజీగా టేస్టీగా చేపల కూర తయారీ..

|

Feb 18, 2022 | 8:22 PM

Andhra Style Fish Curry : రొయ్యలు(prawns) , చేపలు(Fish), పీతలు(crabs) ఇలా అనేక రకాల సీఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక రకాల..

Andhra Style Fish Curry: ఆంధ్ర స్టైల్‌లో ఈజీగా టేస్టీగా చేపల కూర తయారీ..
Fish Iguru
Follow us on

Andhra Style Fish Curry : రొయ్యలు(prawns) , చేపలు(Fish), పీతలు(crabs) ఇలా అనేక రకాల సీఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక రకాల వ్యాధులను నివారించే గుణం చేపల్లో ఉందని.. వారానికి కనీసం చేపలను రెండు సార్లు అయినా తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చేపల్లో కొవ్వు తక్కువ.. ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు ఎక్కువ. ఈ చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో.. అలాగే వీటితో అనేక రకాల ఆహారపదార్ధాలను తయారు చేసుకోవచ్చు. చేపల్లోని రకాన్ని బట్టి, ఇగురు చేప, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా రకరకాలుగా చేపలతో తినే ఆహారపదార్ధాలను తయారు చేస్తారు.  అయితే ఆంధ్రాలో ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు చేపలతో మంచి అనుబంధం ఉంది.  రోజు ఆంధ్ర స్టైల్ లో ఈజీగా టేస్టీగా చేపల కూర తయారీ విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 
చేప ముక్కలు
ఉల్లిపాయలు – 4
పచ్చి మిర్చి – 6
అల్లం
వెల్లుల్లి
ధనియాలు
జీలకర్ర
కారం – 2 టీస్పూన్లు
పసుపు – 1 టీస్పూన్‌
ఉప్పు – రుచికి సరిపడా
టమాటాలు – 2
కొత్తిమీర
నూనె – అర కప్పు,

తయారీ విధానం: చేప ముక్కల్ని ముందుగా శుభ్రంగా కడిగి వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని.. ఆ చేప ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసుకుని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇంతలో మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇపుడు స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పట్టుకుని.. అందులో నూనెలో వేసి వేడి ఎక్కిన తర్వాత చేప ముక్కలను వేయించి తీసుకోవాలి. అనంతరం అదే నూనెలో నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముద్దను వేసుకుని వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి నూనె కూర నుంచి విడిగా వచ్చే వరకు వేయించాలి. అనంతరం చేప ముక్కలను వేసుకుని కొంచెం నీరు పోసుకుని దగ్గర అయ్యేవరకూ ఉడికించాలి. అనంతరం కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఆంధ్రాస్టైల్ లో టేస్టీ టేస్టీ చేపల ఇరుగు రెడీ..

Also Read:

కన్నవాళ్ల కళ్లముందే.. గంటల వ్యవధిలోనే.. మృత్యు ఒడికి చేరిన చిన్నారులు