ప్రతి మహిళ రోజుకొక అరటిపండు తినాలి..! అప్పుడే ఈ 5 సమస్యలకు దూరంగా ఉంటారు..

| Edited By: Anil kumar poka

Sep 16, 2021 | 11:33 AM

Womens Health Tips: అరటిపండులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ ఎ, బి, బి 6, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్,

ప్రతి మహిళ రోజుకొక అరటిపండు తినాలి..! అప్పుడే ఈ 5 సమస్యలకు దూరంగా ఉంటారు..
Womens Health
Follow us on

Womens Health Tips: అరటిపండులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ ఎ, బి, బి 6, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. మహిళలు ముఖ్యంగా ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. అప్పుడే వారు శరీరంలో ఐరన్, కాల్షియం లోపాల నుంచి బయటపడుతారు. అరటిపండును క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. రక్తహీనతను నివారిస్తుంది
భారతదేశంలో చాలామంది మహిళలు రక్తహీనతకు గురవుతున్నారు. దాదాపు 80 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. శరీరంలో తగినంత ఐరన్‌ లేకపోవడంతో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అరటిలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ద్వారా శరీరంలో రక్తం కొరత ఉండదు. దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు.

2. గుండెను రక్షిస్తుంది
రోజూ ఒక అరటిపండు తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. అలాగే బిపి నియంత్రణలో ఉంటుంది. ఈ రెండింటిని నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం, గుండె జబ్బులు దరిచేరవు. అందువల్ల ప్రతిరోజూ ఖచ్చితంగా ఒక అరటిపండు తినాలి.

3. ఎముకలను బలపరుస్తుంది
మహిళల శరీరంలో తరచూ కాల్షియం లోపం కనిపిస్తుంది.దీని కారణంగా వారు కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి సమస్యలతో బాధపడుతారు. అరటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ద్వారా శరీరంలో కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి.

4. డిప్రెషన్‌ను నివారిస్తుంది
నేటి కాలంలో చాలామంది వ్యక్తులు డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతారు. అరటిపండులో విటమిన్-బి 6 సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి పని చేస్తుంది. అలాగే దానిలో ఉండే ప్రోటీన్ మెదడును రిలాక్స్‌గా చేస్తుంది. అరటిలో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

5. జీర్ణవ్యవస్థకు మంచిది
అరటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ వినియోగం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అందుకే ప్రతిరోజు ఒక అరటిపండు తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Banana Leave Benefits: అరిటాకులో భోజనం చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Gaddi Chamanthi: మానని గాయాలు, తీవ్రమైన జుట్టు సమస్యలను పైసా ఖర్చు లేకుండా తీర్చే గడ్డి చామంతి.. ఆరోగ్య ప్రయోజనాలు

Mixed Vegetable Salad: బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ ఫుడ్.. మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్.. తయారీ విధానం ఎలా అంటే