చిన్న ఏలకులు… పెద్ద ప్రయోజనం..! మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు.. తెలిస్తే అవాక్కే..

|

Apr 30, 2024 | 6:15 PM

అంతేకాదు..స్థూలకాయులు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లల్లో కాస్త యాలకుల పొడి కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు..

చిన్న ఏలకులు... పెద్ద ప్రయోజనం..! మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు.. తెలిస్తే అవాక్కే..
Cardamom
Follow us on

ఏలకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఏలకులు సాధారణంగా రెండు రకాలు.. ఒకటి నలుపు, రెండు ఆకుపచ్చ. వంటగదిలో దొరికే ఏలకులు రుచికి, సువాసనకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ఏలకులు తీసుకోవడం మంచిది. అంతేకాదు..ఏలకులు బరువు తగ్గడానికి సహాయపడే అనేక అంశాలను కలిగి ఉంటాయి. మీ ఆహారంలో ఏలకులను చేర్చుకోవటం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఏలకులు మధుమేహంలో మేలు చేస్తుంది. ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయి. ఏలకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి క్యాన్సర్, చర్మ క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే యాలకుల టీకానీ, పాలుకానీ తాగితే మంచి ఉపశమనం కలిగిస్తుంది.

అధిక రక్తపోటును నియంత్రించడంలో పచ్చి ఏలకులు మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్త ప్రసరణను సాధారణీకరించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటుంది. ఏలకులు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆకుపచ్చ ఏలకులు వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, రాత్రిపూట దీనిని ఉపయోగించడం వలన జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో ఏలకులను కలుపుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు..స్థూలకాయులు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లల్లో కాస్త యాలకుల పొడి కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏలకులు వాడితే ఫలితం ఉంటుంది. నెగెటివ్ ఆలోచనల నుంచి ఏలకులు మనల్ని రక్షిస్తాయి. అలాగే, కిడ్నీలోని మలినాలను తొలగించేందుకు కూడా ఏలకులు ఉపయోగపడతాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..