Ginger Pak: దగ్గు, సీజనల్‌ ఫ్లూ నివారించడానికి జింజర్ పాక్.. ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహా..

|

Jan 14, 2022 | 9:52 AM

Ginger Pak: చలికాలంలో ప్రతి ఇంట్లో అల్లం వాడుతారు. కూరల రుచిని పెంచడానికి ఎక్కువగా వినియోగిస్తారు. ఇది కాకుండా, జలుబు, దగ్గు వంటి

Ginger Pak: దగ్గు, సీజనల్‌ ఫ్లూ నివారించడానికి జింజర్ పాక్.. ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహా..
Ginger
Follow us on

Ginger Pak: చలికాలంలో ప్రతి ఇంట్లో అల్లం వాడుతారు. కూరల రుచిని పెంచడానికి ఎక్కువగా వినియోగిస్తారు. ఇది కాకుండా, జలుబు, దగ్గు వంటి సీజనల్‌ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హోం రెమిడిస్‌గా అల్లం రసాన్ని తీసుకుంటారు, ఎందుకంటే అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ అల్లం తినడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని కూడా సూచించింది. సోషల్ మీడియా పేజీలో అల్లం పాక్‌ని తయారు చేసి తినమని తెలిపింది. దీంతో పాటు దాని తయారీకి సంబంధించిన పదార్థాలను షేర్ చేసింది. అంతే కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా అల్లం పాక్‌ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి.. బెల్లం, అల్లం, ఎండు శొంఠి పొడి, నెయ్యి, యాలకులు, దాల్చిన చెక్క, బే ఆకు, నాగకేసర, నల్ల మిరియాలు, కొత్తిమీర పొడి, విడంగ, జీరా, పిప్పాలి, వైవడంగ ఆయుష్ మంత్రిత్వ శాఖ జింజర్ పాక్ చాలా రుచికరమైనదని అనేక సమస్యలను తొలగిస్తుందని తెలిపింది. దీన్ని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. ఇది కాకుండా, జలుబు, దగ్గు కాకుండా, గొంతు నొప్పి, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అల్లం తీవ్రమైన కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. సహజంగా అల్లం ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ అల్లం పాక్‌ని తినాలని మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం.. ఖాళీ కడుపుతో తినవద్దని తెలిపింది.

WI vs IRE: వెస్టిండీస్‌ కొంపముంచిన వర్షం.. ఐర్లాండ్‌ సునాయస విజయం..

ప్లాట్లు లేదా అపార్ట్మెంట్లలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ విషయాలను గమనించండి..?

Srilanka: కిలో పచ్చిమిర్చి రూ.710, టమోటా 200.. దివాళా అంచున శ్రీలంక..