Curdled Milk Dessert : పాలు విరిగిపోయాయని బాధపడుతున్నారా.. అయితే ఈజీ.. టేస్టీ స్వీట్స్ ట్రై చేయండి..

|

Mar 21, 2021 | 11:43 AM

ఒకొక్కసారి పాలు మరగబెడుతున్న సమయంలో విరిగిపోతాయి. అలా పాలు పాడైపోవడానికి ఉష్ణోగ్రతల్లో మార్పులు వంటి అనేక కారణాలున్నాయి. పుల్లని , కొద్దిగా చెడిపోయిన పాలను తిరిగి మనం ఉపయోగంచుకోవచ్చు...

Curdled Milk Dessert : పాలు విరిగిపోయాయని బాధపడుతున్నారా.. అయితే ఈజీ..  టేస్టీ స్వీట్స్ ట్రై చేయండి..
Curdled Milk Dessert
Follow us on

Curdled Milk Dessert : ఒకొక్కసారి పాలు మరగబెడుతున్న సమయంలో విరిగిపోతాయి. అలా పాలు పాడైపోవడానికి ఉష్ణోగ్రతల్లో మార్పులు వంటి అనేక కారణాలున్నాయి. పుల్లని , కొద్దిగా చెడిపోయిన పాలను తిరిగి మనం ఉపయోగంచుకోవచ్చు. అటువంటి విరిగిపోయిన పాలను విసిరివేయకుండా కొన్ని సులభంగా రుచికరమైన పదార్ధాలను తయారు చేసుకోవచ్చు..

స్వీట్ పన్నీర్ :

Sweet Paneer With Spoiled M

స్వీట్ పన్నీర్ తయారీకి ముందుగా విరిగిపోయిన పాలను తీసుకుని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ పాలను మళ్ళీ వేడి చేస్తుండాలి.. దీంతో పాలు చెన్నాలా తయారవుతుంది. అప్పుడు స్టౌ ను ఆపి దానిని వడకట్టాలి. అనంతరం పనీర్ ను ఒక కోలాండర్ ద్వారా వడకట్టి దానిపై చల్లటి నీరు పోయాలి. అలా చల్లటి నీరు పోయడంతో.. పన్నీర్ నుండి వెనిగర్ వాసన తొలగిపోతుంది. అనంతరం అదనపు నీటిని తొలగించి ఒక గిన్నెలో పన్నీరుని తీసుకోవాలి.. దానిలో కొంచెం చెక్కెర వేసి బాగా కలపాలి. దీంతో స్వీట్ పన్నీరు రెడీ అవుతుంది.

మిల్క్ కేక్ :

Milk Cake With Spoiled Milk,

చెడిపోయిన పాలతో మిల్క్ కేక్ కూడా తయారు చేసుకోవచ్చు. , ఒక గిన్నెలో 2 కప్పుల పిండి, ½ టీస్పూన్ బేకింగ్ సోడా మరియు 4 టేబుల్ స్పూన్ల చక్కర పొడిని కలపండి. ఈ పదార్ధాలను బాగా కలిపిన తర్వాత ½ కప్పు పాలు మరియు ½ కప్పు నీరు వేసి బాగా కలపాలి. అనంతరం ఒక కప్పు తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల వెన్నతో పాటు ఒక గుడ్డు వేసి బాగా వేసి గిలకొట్టి.. ఈ మిశ్రమాన్ని మొదటి గిన్నెలో అన్ని పదార్థాలను వేసి తయారు చేసిన మిశ్రమానికి వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో పోసి 300 డిగ్రీల సెల్సియస్ వద్ద 25 నిమిషాలు వేడి చేయండి. తర్వాత దానిని ముక్కలుగా కట్ చేసి రుచికరమైన మిల్క్ కేక్ ఆస్వాదించండి.

కలకండ్ :

Kalakhand With Spoiled Milk

ముందుగా విరిగిన పాలల్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరికొన్ని నిముషాలు వేడి చేయండి. పాలు చెన్నా గా విడిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత విరిగిన పాలను వడకట్టి అదనపు నీటిని పిండి వేయండి. తర్వాత పన్నీర్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు, ఒక గిన్నెలో 4 కప్పుల పాలు తీసుకుని 2 కప్పులు వచ్చే వరకూ మరిగించండి.. అనంతరం సిద్ధం చేసిన పన్నీర్ పిండిని ఆ పాలల్లో వేసి మిశ్రమం చిక్కగా మరియు మృదువైన పిండిగా మారే వరకూ కలుపుతూ ఉండాలి. అనంతరం రుచికి సరిపడా చక్కెర వేసి బాగా కలపాలి. చిన్న పూసలు లేదా ముద్దలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. కొంచెం సేపటికి కలకండ్ మిశ్రమం రెడీ అవుతుంది. అప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో పోయాలి. తర్వాత అర అంగుళం మందంతో సరిచేయాలి. అది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి.

డోనట్స్ :

Doughnuts With Spoiled Milk

విరిగిన పాలతో నోట్లో వేసుకుంటే కరిగిపోయే డోనట్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 పిండిని తీసుకొని, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు ఉప్పు, ¼ కప్పు చక్కెర పౌడర్ ను వేసుకుని ఈ మిశ్రమాన్ని కలపండి. ఇప్పుడు మరొక గిన్నెలో 2 గుడ్లు, 1 కప్పు విరిగిన పాలు మరియు 2 టేబుల్ స్పూన్ల వెన్న జోడించండి. దీనిని కూడా బాగా కలపండి. అనంతరం ముదుంగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని రెండిటిని కలిపి ఒక పిండిగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిక్స్ ను 2 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తరువాత ఆ మిక్స్ ను మందపాటి చపాతీలా ఒత్తుకుని.. డోనట్స్ కట్టర్ తో కట్ చేసి.. వాటిని నూనె లో బంగారు గోధుమ రంగు వరకు డీప్ ఫ్రై చేయండి. అనంతరం వాటిని మీకు నచ్చే విధంగా క్రీమ్ తో అలంకరించండి.. వాటిని ఆస్వాదించండి.

Also Read:  అల్లు అర్జున్ పుష్ప మూవీ కోసం విలన్ గా జాతీయ అవార్డు విన్నర్ ను దింపిన చిత్ర బృందం

ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్‌ – అంబులెన్స్‌ ఢీః.. నలుగురు మృతి.. ముగ్గురికి గాయాలు