
Drink Milk Before Going to Sleep at Night Bed Time: పాలు ప్రతీరోజూ తాగడం చాలా మందికి అలవాటు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కాబట్టి, దీనిని క్రమం తప్పకుండా తాగాలని చెబుతుంటారు. ఆయుర్వేదం ప్రకారం, ఆవు పాలు వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. తద్వారా బలం, శక్తి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ, గరిష్ట ప్రయోజనాలను పొందడానికి మీరు ఎప్పుడు పాలు తాగాలి? అనే విషయం తెలుసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం, నిద్రపోయే అరగంట ముందు పాలు తాగడం మంచిది. ఈ సమయంలో శరీరం ప్రశాంతంగా ఉండటం ప్రారంభమవుతుంది. పాలలోని పోషకాలు మరింత సమర్థవంతంగా గ్రహించబడతాయి. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. సౌకర్యవంతమైన నిద్రను ప్రోత్సహించడంలో సహాయం చేస్తుంది.
రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ, కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ గోరువెచ్చని పాలు తాగితే చాలా మంచిది. అలాగే, మరిన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు పసుపు, ఏలకులు లేదా అల్లం జోడించవచ్చు.
పాలు తాగే ముందు లేదా ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ఉప్పు పదార్థాలు, తేనె, సిట్రస్ పండ్లు లాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటితో కలిపి పాలను తీసుకోవడం వల్ల ఇబ్బంది పడాల్సి ఉంది.
జీర్ణక్రియ సరిగా లేకపోవడం లేదా తరచుగా జలుబు, దగ్గు ఉన్నవారు చల్లని పాలు తాగకూడదు.
గమనిక: ఈ చిట్కాలు కేవలం అవగాహన కల్పించడానికి మాత్రమే అందించాం. సోషల్ మీడియాలో లభించిన సమాచారం మేరకు వీటిని అందించాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా వైద్యుడి సలహాలు తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..